భారీ డిస్కౌంట్‌తో మందు ఆఫర్- అదొక్కటీ చేస్తే చాలు
Delhi Assembly elections 2025: దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గడువు సమీపించింది. ఇంకొక్క రోజే మిగిలివుంది. బుధవారం ఉదయం సరిగ్గా 7 గంటలకు పోలింగ్ ఆరంభం కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, ఇతర సామాగ్రితో పోలింగ్ సిబ్బంది బూత్‌లకు తరలి వెళ్తోన్నారు. 8వ తేదీన ఓట్లను లెక్కిస్తారు.
అసెంబ్లీ ఎన్నికల బరిలో మొత్తం 699 మంది అభ్యర్థులు నిలిచారు. ముఖ్యమంత్రి ఆతిషి సహా 96 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 1,55,24,858 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 83,49,645 మంది పురుషులు, 71,73,952 మంది మహిళలు, 1,261 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు. వీరందరూ గురువారం కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు.

సీనియర్ సిటిజన్ల ఓట్లు 24,44,320 ఉండగా.. 80 సంవత్సరాలకు మించి వయస్సు ఉన్న ఓటర్ల సంఖ్య 2,77,221. చాలామంది ఇంటి నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు కూడా. మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ వంటి ప్రముఖులూ ఇంటి నుంచే ఓటు వేశారు.
15 సంవత్సరాలుగా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీని ఏలుతోంది. 2014 తరువాత మరో పార్టీకి అవకాశమే ఇవ్వట్లేదు ఢిల్లీ ఓటర్లు. భారీ మెజారిటీతో అరవింద్ కేజ్రీవాల్ పార్టీని గెలిపిస్తూ వస్తోన్నారు. 2020 నాటి ఎన్నికల్లోనూ చరిత్ర తిరగరాసింది ఆప్. మొత్తం 70 నియోజకవర్గాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో 62 స్థానాలను కొల్లగొట్టింది. ఇప్పుడూ అలాంటి రికార్డే సృష్టించాలని ఉవ్విళ్లూరుతోంది.
కాగా- పోలింగ్ శాతాన్ని పెంచడానికి ఛాంబర్స్ ఆఫ్ ట్రేడర్స్ అండ్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ 50 శాతం వరకు డిస్కౌంట్‌ను ప్రకటించింది. దీని పరిధిలోని అన్ని దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, కిరాణా షాపులు, హోటళ్లు, మాల్స్, ధాబాలు, కాఫీ షాపులు.. ఇలా అన్నింట్లోనూ 20 నుంచి 50 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
చివరికి బార్బర్ షాపులు, బ్యూటీ పార్లర్లలోనూ ఇది వర్తిస్తుంది. ఓటు వేసినట్లు తమ వేలికి ఇంకు మార్కును చూపించి రాయితీని పొందవచ్చని ఛాంబర్స్ ఆఫ్ ట్రేడర్స్ అండ్ ఇండస్ట్రీస్ తెలిపింది. పోలింగ్ రోజు మాత్రమే కాకుండా మరుసటి రోజు కూడా బ్యూటీపార్లర్లు రాయితీని అందిస్తాయని పేర్కొంది.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications