ఏంటీ ఘోరం.. భారతీయ వస్త్రధారణలో వచ్చారని.. రెస్టారెంట్‌ లోకి నో ఎంట్రీ..

మారుతున్న జీవన విధానం కారణంగా దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో పబ్ కల్చర్ విచ్చలవిడిగా పెరిగిపోయింది. రెస్టారెంట్స్, పబ్స్ వివిధ రకాల డ్రెసింగ్ కోడ్స్ అని పెట్టి దేశ సంస్కృతిని దిగజారుస్తున్నారు. దిల్లీలో జరిగిన ఈ షాకింగ్ ఘటన గురించి తెలిస్తే ఎవరైనా నోరు వెళ్లబెట్టాల్సిందే. దేశ రాజధాని దిల్లీలో భారతీయ వస్త్రధారణలో వచ్చిన ఓ జంటకు ఊహించని షాక్ ఇచ్చింది ఓ రెస్టారెంట్. భారతీయ వస్త్రధారణలో వచ్చారని ఆ జంటను రెస్టారెంట్ లోకి అనుమతించలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

దేశ రాజధాని దిల్లీలో అమానవీయ ఘటన జరిగింది. భారతీయ వస్త్రధారణలో ఒక రెస్టారెంట్‌ కు వెళ్లిన ఆ జంటకు చేదు అనుభవం ఎదురైంది. ఇండియన్‌ డ్రెసింగ్‌ లో వచ్చిన ఆ జంటను రెస్టారెంట్ ‌లోకి వెళ్లేందుకు అక్కడి సిబ్బంది అనుమతించలేదు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అయింది. దీంతో రెస్టారెంట్‌ యాజమాన్యంపై నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే ఈ ఘటనపై దిల్లీ మంత్రి కపిల్‌ మిశ్రా స్పందించారు. ఈ విషయాన్ని దిల్లీ సీఎం రేఖా గుప్తా దృష్టికి తీసుకెళ్లినట్లు స్పష్టం చేశారు.

Delhi Couple Shocked Restaurant Denies Entry Over Indian Attire Video Goes Viral

మరోవైపు తమను రెస్టారెంట్ లోకి అనుమతించకపోవడమే కాకుండా తమతో రెస్టారెంట్ మేనేజర్‌ అసభ్యంగా ప్రవర్తించాడని ఆ జంట ఆరోపించింది. దీంతో రెస్టారెంట్ పై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజెన్లు పోస్టులు పెడుతున్నారు. దేశ రాజధాని పరువు ప్రతిష్టలను కొన్ని రెస్టారెంట్లు మంట గలుపుతున్నాయని మండిపడుతున్నారు. ఇక దిల్లీ సీఎం రేఖా గుప్తా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+