సోనియా గాంధీకి ఢిల్లీ హైకోర్టులో ఊరట- పౌరసత్వానికి ముందే ఓటు హక్కుపై..!
కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత్రి, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీకి ఇవాళ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో భారీ ఊరట లభించింది. రాహుల్ గాంధీ చేపట్టిన ఓట్ల చోరీ ఉద్యమం నేపథ్యంలో సోనియా గాంధీ కూడా భారత పౌరసత్వం రాకముందే ఓటరుగా నమోదు అయ్యారంటూ బీజేపీ నేతలు ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో సోనియాగాంధీపై చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని ఆదేశించాలని కోరుతూ ఢిల్లీ కోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఇవాళ కీలక ఆదేశాలిచ్చింది.
కాంగ్రెస్ ఎంపీ సోనియా గాంధీ భారత పౌరసత్వం పొందడానికి ముందే ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకున్న ఆరోపణలపై ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కొట్టేసింది. 1983 ఏప్రిల్ 30న సోనియా భారత పౌరసత్వం పొందినప్పటికీ, 1980లోనే ఆమెను ఢిల్లీ ఓటర్ల జాబితాలో చేర్చారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు తన ఉత్తర్వులను ప్రకటించింది.

సోనియా గాంధీ పేరు 1980లో ఓటరు జాబితాలో చేర్చారని, తిరిగి 1982లో డిలీట్ చేశారని పిటిషనర్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని కోర్టును కోరారు. 1983 ఏప్రిల్ 30న సోనియా అధికారికంగా భారత పౌరసత్వం పొందారని కోర్టుకు తెలిపారు. దీనిపై పోలీసులతో దర్యాప్తు అవసరమని పట్టుబట్టారు. అయితే కోర్టు మాత్రం ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసేలా ఆదేశాలు ఇచ్చేందుకు నిరాకరించింది. పిటిషన్ ను కొట్టేస్తూ కీలక తీర్పు ఇచ్చింది. దీంతో సోనియాకు ఊరట దక్కినట్లయింది.












Click it and Unblock the Notifications