Delhi Exit Poll Result 2020: రిపబ్లిక్ టీవీ-జన్ కీ బాత్: ఆప్‌దే అధికారం, బీజేపీకి ఎన్ని సీట్లంటే?
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలు శనివారం సాయంత్రం ముగియడంతో పలు మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తున్నాయి. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో ఓటర్లు ఓటు వేసేందుకు అంతగా ఆసక్తి చూపనట్లుగానే తెలుస్తోంది. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 67.5శాతం ఓటింగ్ నమోదవగా.. తాజాగా జరిగిన ఎన్నికల్లో కేవలం 54.6శాతమే కావడం గమనార్హం.
ఢిల్లీ ఎన్నికలను ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా బాగానే శ్రమించింది. అయినప్పటికీ ఆప్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఢిల్లీ ఓటర్లు ఆమ్ ఆద్మీ పార్టీకి మరోసారి పట్టం కట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇక మీడియా సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ గమనించినట్లయితే.. అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి, బీజేపీకి మధ్య ప్రధానంగా గట్టి పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. రిపబ్లిక్ టీవీ-జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం ఢిల్లీలో మళ్లీ ఆమ్ ఆద్మీ పార్టీనే అధికారం చేపడుతుందని స్పష్టం చేసింది.

మొత్తం 70 సీట్లు: రిపబ్లిక్ టీవీ-జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు:
ఆమ్ ఆద్మీ పార్టీ: 48-61
బీజీపీ: 9-21
కాంగ్రెస్: 0-1
ఇతరులు: 0
దాదాపు ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఆమ్ ఆద్మీ పార్టీదే మళ్లీ అధికారమని స్పస్టం చేశాయి. బీజేపీ రెండో స్థానానికి పరిమితమైంది. కాంగ్రెస్ మాత్రం ఘోరంగా విఫలమైంది. గతంలో వచ్చిన సీట్లు కూడా రాకపోవడం గమనార్హం. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తమకు అనుకూలంగా ఉండటంతో ఆప్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. బీజేపీ నేతలు మాత్రం నిరాశలో కూరుకుపోయారు. కాగా, ఫిబ్రవరి 11న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications