గృహహింస కేసులో సోమ్‌నాథ్‌కు ఊరట..కేసు కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు..
ఢిల్లీ : ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతికి రిలీఫ్ దొరికింది. ఆయనపై ఉన్న గృహహింస ఆరోపణలను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. కేసు విచారణ జరుపుతున్న జస్టిస్ చందర్ శేఖర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. సోమ్‌నాథ్ భారతి తన భార్య లిపికా మిత్రతో సంతోషం కాపురం చేస్తున్నందున క్రిమినల్ కేసుకు ఆస్కారంలేదని న్యాయస్థానం అభిప్రాయపడింది.2015 జూన్ 10న లిపికా మిత్రా భర్త సోమ్‌నాథ్ భారతి విధిస్తున్నారంటూ ఢిల్లీ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. తన భర్త తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది.

దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ పోలీసుల అదే ఏడాది సెప్టెంబర్ 9న ఆయనపై గృహ హింస కేసు నమోదుచేశారు. దీనిపై మూడేళ్లుగా ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతోంది.తాజాగా తన భార్యతో సంతోషంగా కలిసి జీవిస్తున్నందున క్రిమినల్ కేసును కొట్టివేయాలంటూ సోమ్‌నాథ్ భారతి పిటీషన్ దాఖలు చేశారు. దానిపై ఆయన భార్య లిపికా మిత్ర తనకు ఎలాంటి అభ్యంతరంలేదని చెప్పడంతో న్యాయస్థానం కేసు కొట్టివేసింది.












Click it and Unblock the Notifications