సీబీఐ కొరడా- ఉప ముఖ్యమంత్రి అరెస్ట్..!!
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యారు. ఆయనను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ఉదయం నుంచి విచారించిన అనంతరం ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
న్యూఢిల్లీ: ఊహించిందే జరిగింది. అనుమానాలన్నీ వాస్తవ రూపాన్ని దాల్చాయి. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం వ్యవహారంపై సీబీఐ అధికారులు తమ విచారణను మరింత ముమ్మరం చేశారు. మద్యం పాలసీని రూపొందించే విషయంలో ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిందంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు చేసిన ఫిర్యాదు నేపథ్యంలో- ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు.
తాజాగా- ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు. ఈ ఉదయం నుంచీ ఆయన సీబీఐ విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ ఉదయమే ఆయన ఢిల్లీలోని సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. మద్యం కుంభకోణంలో ఆయన ప్రమేయం ఉన్నట్లు సీబీఐ అధికారులు ముందు నుంచీ అనుమానాలు వ్యక్తం చేస్తోన్నారు. ఇదివరకే ఆయనను విచారించారు కూడా. ఇవ్వాళ మరోసారి మనీష్ సిసోడియాను విచారణకు పిలిపించారు సీబీఐ అధికారులు. విచారణ అనంతరం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

ఈ క్రమంలో ఢిల్లీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. విచారణకు బయలుదేరి వెళ్లడానికి ముందు మనీష్ సిసోడియా నివాసానికి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆయనకు అండగా ఉంటామని ప్రకటించారు. మనీష్ సిసోడియాకు మద్దతుగా నినాదాలు చేశారు. ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, బీజేపీ, సీబీఐకి వ్యతిరేకంగా నినదించారు.
తన మద్దతుదారులతో కలిసిన అనంతరం నివాసం నుంచి నేరుగా రాజ్ ఘాట్ కు బయలుదేరి వెళ్లారు. జాతిపిత మహాత్మాగాంధీకి నివాళి అర్పించారు. కొన్ని నిమిషాల పాటు అక్కడే మౌనంగా గడిపారు. ఆ సమయంలో ఆయన వెంట ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ మాత్రమే ఉన్నారు. సుమారు 20 నిమిషాల పాటు రాజ్ ఘాట్ లో గడిపిన అనంతరం మనీష్ సిసోడియా.. సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు.
ఈ పరిణామాలన్నింటిపైనా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. సంచలన ట్వీట్ చేశారు. జైలు నుంచి త్వరగా విడుదల కావాలని తాను దేవుణ్ని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. మనీష్ సిసోడియా అరెస్ట్ కావడం ఖాయం కావడం వల్లే అరవింద్ కేజ్రీవాల్ ఇలా స్పందించారనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. అదే సమయంలో ఢిల్లీ దక్షిణ జిల్లా వ్యాప్తంగా పోలీసులు 144 సెక్షన్ ను విధించడం కూడా మనీష్ సిసోడియా అరెస్ట్ తప్పకపోవచ్చనే సందేశాన్ని పంపించినట్టయింది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications