ఈడీ కస్టడీకి ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్-భగత్ సింగ్ గా అభివర్ణించిన కేజ్రివాల్
మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసిన ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేందర్ జైన్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఆయన్ను అరెస్టు చేయడంపై ఆప్, బీజేపీ మధ్య ఇప్పటికే మాటలయుద్ధం కొనసాగుతోంది. ఇదే సమయంలో ఈడీ కోర్టు సత్యేందర్ జైన్ ను వచ్చే నెల 9వరకూ ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు ఇచ్చింది.
నిన్న మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసిన ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జూన్ 9 వరకు కస్టడీలోకి తీసుకుంది. తిరిగి జూన్ 9న కోర్టు ముందు ఆయన్ను హాజరుపరచనున్నారు. సత్యేందర్ ను 14 రోజుల కస్టడీకి అప్పగించాలని కోరుతూ, ఈ కేసులో డబ్బు మూలాలు, జాడను కనుగొనవలసి ఉందని ఈడీ కోర్టుకు తెలిపింది. ఆ డబ్బు అతనిదేనా లేదా అతను వేరొకరి కోసం డబ్బును లాండరింగ్ చేస్తున్నాడా అనేది తమకు తెలియదని కోర్టుకు తెలిపింది. ఇతర మనీ ట్రయల్స్ ఉన్నాయో లేదో చూడాలని పేర్కొంది.

నిందితుల బంధువులైన అంకుష్, వైభవ్ జైన్‌లు అఫిడవిట్‌పై వాంగ్మూలాలు ఇచ్చారని తెలిపింది. సత్యేందర్ జైన్ తరపున వాదించిన సీనియర్ న్యాయవాది ఎన్ హరిహరన్ ఈడీ వాదనలకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. అతని ఇంట్లో ఇప్పటికే రెండు పర్యాయాలు సోదాలు నిర్వహించామని.. అతని బ్యాంకు ఖాతాలను కూడా సీజ్ చేశామని చెప్పారు. ఎట్టకేలకు కోర్టు సత్యేందర్ జైన్‌కు జూన్ 9 వరకు ఈడీ కస్టడీ విధించింది.
మరోవైపు మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌ను అరవింద్ కేజ్రీవాల్ సమర్థించారు. ఆయనపై వచ్చిన ఆరోపణలు తప్పుడువేనని ఆరోపించారు. సత్యేందర్ జైన్ పత్రాలు నేనే చదివాను.. ఆరోపణలన్నీ బూటకమే.. ఈ కేసు మొత్తం ఫేక్.. అందులో 1% నిజం ఉంటే నేను చాలా కాలం క్రితమే చర్యలు తీసుకుని ఉండేవాడిని. నిజమే గెలుస్తుంది.. చాలా మందిపై కేసులు పెట్టారు. మా ఎమ్మెల్యేలు, నాపై కూడా సత్యేందర్ జైన్ క్లియర్ అవుతారు" అని అరవింద్ కేజ్రీవాల్ ఒక ప్రకటనలో తెలిపారు.












Click it and Unblock the Notifications