మోడీకి ఆధ్యాత్మిక గురువునంటూ వీఐపీ సౌకర్యాలు పొందుతున్నాడు: చివరకు అరెస్ట్
న్యూఢిల్లీ: తాను ప్రధానమంత్రికి ఆధ్యాత్మిక గురువునంటూ వివిధ ప్రాంతాల్లో సంచరిస్తున్న ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. పుల్కిత్ మహారాజ్ అలియాస్ పుల్కిత్ మిశ్రా అనే వ్యక్తి.. తాను వెళ్లిన ప్రతి రాష్ట్రంలో వ్యక్తిగత లబ్ధి కోసం తాను నరేంద్ర మోడీకి ఆధ్యాత్మిక గురువునని చెప్పుకుంటున్నాడని పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలో వీఐపీ ప్రొటోకాల్ పొందడమే కాకుండా అనేక వెసులుబాట్లు పొందినట్లు గుర్తించామని చెప్పారు. అయితే, ప్రధాన మంత్రికి, పుల్కిత్‌కు ఎలాంటి సంబంధం లేదని పీఎంఓ నుంచి స్పష్టత రావడంతో రంగంలోకి దిగి అతడ్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

తాను నివసించేందుకు భద్రతా దళంతో కూడిన ఒక నివాసాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లా కలెక్టర్‌కు పుల్కిత్ లేఖ రాశారు. ఇందులో ఆయన కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శినని పరిచయం చేసుకున్నాడు.
అంతేగాక, మోడీతోపాటు అనేకమంది ప్రముఖులతో ఫొటోలు దిగినట్లు నకిలీ చిత్రాలు సృష్టించాడు. తనను రాష్ట్రపతి సిఫార్సు చేశారని, వీఐపీ వైద్యం అందించాలని కోరుతూ ఓ వైద్యశాలను సంప్రదించినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications