ఢిల్లీ హైఅలర్ట్: హుటాహుటిన సోనియా నివాసానికి ప్రియాంక గాంధీ: ఏం జరుగుతోంది?

న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత్రి సోనియా గాంధీ ఇవ్వాళ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో- దేశ రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు, ఆందోళనలను నిర్వహించ తలపెట్టడంతో ట్రాఫిక్ పోలీసులు ప్రధాన మార్గాల్లో వాహనాల రాకపోకలను దారి మళ్లించారు. ఈడీ కార్యాలయానికి దారి తీసే మార్గాల్లో ఎక్కడికక్కడ బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు.

నేషనల్ హెరాల్డ్ కేసులో ఇవ్వాళ సోనియా గాంధీ ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఇంకాస్సేపట్లో ఆమె తన నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి బయలుదేరి వెళ్తారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కొద్దిసేపటి కిందటే సేపటి కిందటే సోనియా నివాసానికి వచ్చారు. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ నుంచి పలువురు కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక వాహనాల్లో ఢిల్లీకి చేరుకున్నారు. ఎక్కడికక్కడ బైఠాయించారు. సోనియాగాంధీ ఫొటోలు ముద్రించివున్న ప్లకార్డులను ప్రదర్శిస్తోన్నారు.

Delhi Police has issued traffic advisory as major routes as Congress set to stage protests

ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. ట్రాఫిక్ అడ్వైజరీని జారీ చేశారు. మేటీ జంక్షన్, తుగ్లక్ రోడ్ జంక్షన్, క్లారిడ్జెస్ జంక్షన్, క్యూ-పాయింట్ జంక్షన్, సునెహ్రి మసీద్ జంక్షన్, మౌలానా ఆజాద్ రోడ్ జంక్షన్, మాన్‌సింగ్ రోడ్ జంక్షన్ మార్గాల్లో విపరీతమైన వాహనాల రద్దీ నెలకొంది. ట్రాఫిక్ జామ్ అయింది. డాక్ ఖానా జంక్షన్, పటేల్ చౌక్, విండ్సర్ ప్లేస్, తీన్ మూర్తి చౌక్, పృథ్వీరాజ్ రోడ్ వంటి మార్గాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది.

Delhi Police has issued traffic advisory as major routes as Congress set to stage protests

మోతీలాల్ నెహ్రూ మార్గ్, అక్బర్ రోడ్, జన్‌పథ్, మాన్‌సింగ్ రోడ్ మార్గాల్లో మధ్యాహ్నం 2 గంటల వరకు రాకపోకలు సాగించవద్దంటూ ఢిల్లీ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీని జారీ చేశారు. ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ప్రత్యేక వాహనాల్లో ఢిల్లీకి చేరుకుంటోన్నారు. ఇవ్వాళంతా వారు వేర్వేరు ప్రాంతాల్లో ధర్నాలు, ఆందోళనలను నిర్వహించనున్నారు. పలుచోట్ల బైఠాయించారు కూడా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+