క్రిమినల్‌ను చేజ్ చేస్తుండగా ఎకె 47 పేలి...

న్యూఢిల్లీ: వాంటెడ్ క్రిమినల్‌ను పట్టుకునేందుకు అతన్ని వెంబడిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు తన చేతిలోని తుపాకీ మిస్ ఫైర్ కావడంతో ప్రత్యేక విభాగం పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన ఢిల్లీ శివారులోని రోహిణిలో బుధవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది.

రవీంద్ర బోలు అనే రౌడీ షీటర్‌కు ముఖ్య అనుచరుడైన సోనూ పండిత్‌ అనే నేరస్థుడు రోహిణి సెక్టార్‌ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం అందడంతో ఢిల్లీ ప్రత్యేక పోలీసు విభాగం అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టింది.

Delhi Police Special Cell cop accidentally shot dead while chasing wanted criminal

అతడిని గుర్తించి వెంబడించే క్రమంలో చేతిలోని ఎకె 47 తుపాకి ప్రమాదవశాత్తు పేలిపోయి ఆనంద్ ఖత్రీ (32) అనే పోలీసు తీవ్రంగా గాయపడి మరణిం్చాడు. 2015 సంవత్సరం చివరలో అతను ప్రత్యేక విభాగానికి బదిలీ అయ్యాడు. రవీంద్ర బోలు హత్య, బలవంతపు వసూళ్లు, దోపిడీ కేసుల్లో నిందితుడు.

ఆనంద్‌ను వెంటనే మంగోల్పూర్‌లో గల సంజయ్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే, అతను అప్పటికే మరణించినట్లు వైద్యులు తేల్చారు. చివరకు ప్రత్యేక విభాగం పోలీసులు మాత్రం పండిత్‌ను పట్టుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+