సీబీఐ దాడులు: ఆప్ మనిషే లీక్ చేశాడు
న్యూఢిల్లీ: సీనియర్ ఐఏఎస్ అధికారి రాజేంద్రకుమార్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయాలపై దాడులు జరగడానికి కారణం ఎవరో తెలిసింది. ఇండియన్ పోస్ట్ అండ్ టెలికం అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సర్వీస్ అధికారి ఆశిష్ జోషి సమాచారం ఇవ్వడంతో సీబీఐ దాడులు జరిగాయి.
ఆశిష్ జోషి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. రాజేంద్రకుమార్ అవినీతి గురించి ఆశిష్ జోషి ఏసీబీ చీఫ్ ఎం.కే.మీనాకు ఫిర్యాదు చేశారు. అయితే ఆఫిర్యాదు పరిశీలించిన ఏసీబీ ఇది తమ స్థాయి పరిధిలోకి రాదని సీబీఐకి పంపించింది.
సీబీఐ అధికారులు అదునుచూసి ఒక్క సారిగా ఢిల్లీ సచివాలయం మీద దాడులు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయిన ఆశిష్ జోషిని గతంలో ఢిల్లీ ఆప్ ప్రభుత్వం తెచ్చుకుంది. ఆయన గురించి ఎవరికీ పెద్దగా తెలియదు.

ఆశిష్ జోషిని ఆప్ తెచ్చుకోవడం వెనుక ఆశిష్ ఖేతాన్ అనే ఆయన ఉన్నారు. ఖేతాన్ అమ్ ఆద్మీ పార్టీ కోసం 70 పాయింట్ల కీలక ఎజెండా సిద్దం చేసి ఇచ్చిన కీలక వ్యక్తి. తరువాత డీడీసీకి అరవింద్ కేజ్రీవాల్ చైర్ పర్సన్ గాను, ఖేతాన్ వైస్ చైర్మన్ గాను ఉండేవారు.
డీడీసీ సభ్య కార్యదర్శిగా ఆశిష్ జోషిని నియమించారు. అనంతరం ఆప్ పార్టీ వర్గాలు తనను తీవ్రంగా అవమానిస్తున్నాయని ఆరోపిస్తూ ఖేతాన్ డీడీసీ నుంచి బయటకు వచ్చేశారు. అనంతరం ఆశిష్ జోషి మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
ఆశిష్ జోషి మీద ఆరోపణలు రావడంతో డీడీసీ సభ్య కార్యదర్శి పదవి నుంచి ఆయనను తప్పించారు. తరువాత ఆశిష్ జోషిని మాతృ సంస్థకు పంపించారు. జోషి బయటకు వచ్చిన తరువాత రాజేంద్ర కుమార్ మీద ఫిర్యాదు చెయ్యడంతో సీబీఐ దాడులు జరిగాయి. రాజేంద్ర కుమార్ సీబీఐ కార్యాలయంలో విచారణ ఎదుర్కోంటున్నారు.












Click it and Unblock the Notifications