వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లైంగిక వేధింపులు: తొమ్మిదో తరగతి విద్యార్ధి ఆత్మహత్య

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని నోయిడాలో తొమ్మిదో తరగతి చదివే విద్యార్ధిని ఆత్మహత్య చేసుకొంది. అయితే స్కూల్‌లో పనిచేసే ఇద్దరు టీచర్లు లైంగికంగా వేధింపులకు పాల్పడ్డారని విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పింది. ఈ మేరకు మృతురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇక్షా రాఘవ్ ‌షా కు చెందిన కుటుంబం నోయిడా పోలీసులకు శుక్రవారం నాడు ఓ ఫిర్యాదు చేసింది. రాజీవ్ సెహగల్, నీరజ్ ఆనంద్ అనే ఇద్దరు ఉపాధ్యాయులు మయూర్ విహర్‌లో తమ కూతురు చదివే స్కూల్లో విద్యాభోధన చేసేవారని చెప్పారు.

Delhi Student, 15, Hangs Self. Parents Say 2 Teachers Sexually Harassed Her

అయితే స్కూల్లో తమ కూతురిని ఈ ఇద్దరు ఉపాధ్యాయులు లైంగికంగా వేధింపులకు గురిచేశారని బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అంతేకాదు బాధితురాలిని పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని కూడ ఆ ఇద్దరు టీచర్లు బెదిరించారని కుటుంబసభ్యులు చెప్పారు. మరో వైపు తన ప్రైవేట్ పార్ట్‌లో అసభ్యంగా తడిమారని మృతురాలు కుటుంబసభ్యులకు చెప్పినట్టు వారు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

తమ కూతురు మరణానికి స్కూల్‌కు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులే కారణమని ఆయన ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఆరోపణలను స్కూల్ ప్రిన్సిఫాల్ ఖండించారు. తమ స్కూల్‌కు చెందిన విద్యార్ధి మరణించడం దురదృష్టకరమైన ఘటనగా చెప్పారు. అయితే అయితే పరీక్షలను తాము సిబిఎస్‌ఈ షెడ్యూల్ ప్రకారంగా నిర్వహిస్తామని చెప్పారు.అయితే ఈ కేసు విచారణకు సంబంధించి తాము పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని ప్రిన్సిఫాల్ చెప్పారు.

మంగళవారం సాయంత్రం ఇంట్లో బాలికను ఒంటరిగా ఉంచి బయటకు వెళ్ళారు కుటుంబసభ్యులు. అయితే ఆ సమయంలో ఇంట్లో ఉరేసుకొని ఆ బాలిక ఆత్మహత్య చేసుకొంది. ఇంటికి వచ్చిన తర్వాత బాలికను ఆసుపత్రికి తీసుకెళ్తే అప్పటికే ఆమె మరణించినట్టుగా వైద్యులు ప్రకటించారు.

English summary
A 15-year-old student of class 9 has allegedly committed suicide, she told her patents two of her school teachers sexually harassed her.:
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X