Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ChatGPTకి కులపరమైన పక్షపాతం - ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్

భారతదేశం అంటేనే సర్వమతాలకు పుట్టినిల్లు. విభిన్న మతాలకు, విభిన్న కులాలకు, విభిన్న సంస్కృతులకు చెందిన వారంతా కలిసి భిన్నత్వంలో ఏకత్వం లాగా కలిసి ఉంటారు. కానీ "కులం" అనే కాన్సెప్ట్ నేటికి కూడా ఒక బలమైన వివాదంగా మారుతోంది. ఇన్నాళ్లు కులాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాల్లో ఎందరో పబ్బం గడిపిన వారు ఉన్నారు. కులాల కారణంగానే గొడవలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు భారతదేశంలో కుల రాజకీయాలపై సాగుతున్న చర్చ ఇప్పుడు మరో కొత్త మలుపు తిరిగింది.

కాగా విద్య, పరిపాలన, ప్రజాస్వామ్య వ్యవస్థల వరకే పరిమితమై ఉన్న ఈ వాదనలు... తాజాగా సాంకేతికత, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వైపుకు కూడా విస్తరించాయి. ఈ నేపథ్యంలోనే ChatGPT‌కు కులపరమైన పక్షపాతం ఉందని ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన ఢిల్లీ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ విజేందర్ సింగ్ చౌహాన్.. ChatGPT శిక్షణ పొందిన డేటా ప్రధానంగా అగ్ర కులాల ప్రభావంలో రూపొందించబడిందని వ్యాఖ్యానించారు.

delhi-university-professor-stated-that-chatgpt-has-caste-bias

కాగా UPSC అభ్యర్థులకు మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించే వ్యక్తిగా గుర్తింపు పొందిన ఆయన, AI వ్యవస్థల తటస్థతపై తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు. ChatGPT ఇప్పటికే అందుబాటులో ఉన్న కంటెంట్‌పై శిక్షణ పొందింది. ఆ కంటెంట్ ఎవరి చేతుల్లో రూపొందింది? ఎక్కువగా అగ్ర కులాల చేతుల్లోనే అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అలాంటి పునాదిపై తయారైన యంత్రం నిజంగా న్యాయం చేయగలదా?" అని ఆయన ప్రశ్నించారు. అంతే కాకుండా ఈ పోరాటం ఇక కేవలం అధికార వ్యవస్థలతో మాత్రమే కాదని, అల్గోరిథంలతో కూడిన పోరాటంగా మారిందని అన్నారు.

మనం ఇంతకాలం వైస్‌ ఛాన్సలర్లు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి, బ్యూరోక్రసీతో పోరాడాం. ఇప్పుడు అల్గోరిథంలతో కూడా పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవి మన మంచి-చెడును గుర్తించే సామర్థ్యాన్నే మెల్లగా హరిస్తాయి" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు వెలువడిన వెంటనే సోషల్ మీడియాలో తీవ్ర చర్చ మొదలైంది. కొందరు ఆయన అభిప్రాయాలను సమర్థిస్తూ, "AI కూడా మనుషులే రూపొందిస్తారు కాబట్టి అందులో మానవ పక్షపాతాలు ఉండే అవకాశం ఉంది అని వాదించారు. ముఖ్యంగా డేటా సోర్సులు, కంటెంట్ ఆధిపత్యం గురించి చర్చ అవసరమేనని అభిప్రాయపడ్డారు.

AI అనేది గ్లోబల్ టెక్నాలజీ. దానికి కులం అనే ట్యాగ్ అతికించడం ప్రమాదకరం" అంటూ పలువురు అభ్యంతరం తెలిపారు. విద్యావేత్తలు సమాజంలో ఐక్యతను పెంపొందించాల్సిన బాధ్యత కలవారని, కానీ ఇలాంటి వ్యాఖ్యలు యువతలో అనవసరమైన విభేదాలను పెంచుతాయని అన్నారు. ఒక UPSC అభ్యర్థి సోషల్ మీడియాలో స్పందిస్తూ.. AI లాంటి తటస్థ సాంకేతికతకు కూడా కుల కోణం జోడించడం ఆశ్చర్యకరమంటూ కామెంట్స్ చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+