దడ పుట్టిస్తున్న డెల్మీక్రాన్: ఒమిక్రాన్ కొనసాగుతుండగానే షాకింగ్ న్యూస్; డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్తుందో?
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఆందోళన కొనసాగుతూనే ఉంది. కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ లతో మానవ సమాజం మీద దాడి చేస్తోంది. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. మహమ్మారిపై పోరాటానికి వ్యాక్సిన్లను తయారుచేయడంలో, మందులను అందించడంలో ప్రపంచ ఫార్మా ఇండస్ట్రీ పరిశోధనలు జరుపుతూనే ఉంది.

యూఎస్ మరియు ఐరోపా దేశాలలో డెల్మీక్రాన్ కేసులు?
ఇదిలా ఉంటే భారతదేశానికి కరోనా మహమ్మారి ఊపిరాడనివ్వడం లేదు. తాజాగా కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశవ్యాప్త ఆందోళన కొనసాగుతోంది. ఇక ఇదే సమయంలో మరో దిగ్భ్రాంతికరమైన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా వేరియంట్ అయిన డెల్టా కేసులు, ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. అయితే తాజాగా డెల్మీక్రాన్ కేసులు కూడా నమోదవుతున్నాయన్న వార్త ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే యూఎస్ మరియు ఐరోపా దేశాలు డెల్మీక్రాన్ కేసులతో సతమతమవుతున్నాయని అక్కడి వైద్యనిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ల హైబ్రీడ్ రకం డెల్మీక్రాన్
డెల్టా వేరియంట్ , ఒమిక్రాన్ వేరియంట్ తో కలిసి డెల్మీక్రాన్ వేరియంట్ మరో హైబ్రీడ్ రకం తయారైందని, దీని కారణంగా విపరీతంగా కేసులు నమోదు అవుతున్నాయని వైద్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలోని కోవిడ్ -19 టాస్క్‌ఫోర్స్ సభ్యుడు డాక్టర్ శశాంక్ జోషి డెల్టా వేరియంట్ మరియు ఒమిక్రాన్ వేరియంట్ యొక్క ప్రొటీన్ల కలయికతో కరోనావైరస్ యొక్క డెల్మిక్రాన్ వేరియంట్ ఉందని షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. ఇది ఎలా ప్రవర్తిస్తుంది అన్నదానిపై అధ్యయనం జరగాల్సి ఉందన్నారు.

కొత్త డెల్మీక్రాన్ వేరియంట్ పై సరికొత్త ఆందోళన
ఇప్పటికే కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా వేరియంట్ కంటే మూడు రెట్లు అధికంగా వ్యాప్తి చెందుతుందని, అందులో భయంకరమైన మ్యుటేషన్లు జరుగుతున్నాయని చెబుతున్న నేపథ్యంలో ప్రపంచం మొత్తం ఆందోళనలో ఉంది.అయితే తీవ్రత తక్కువగా ఉందని చెప్పడంతో ప్రపంచం కాస్త ఊపిరి పీల్చు కుంటుంది. ఇక ఇదే సమయంలో డెల్మీక్రాన్ కొత్త వేరియంట్ ఉద్భవించిందని చెప్పడం ఒక్కసారిగా అందరిని ఆందోళనకు గురి చేస్తుంది.

డెల్టా సృష్టించిన విధ్వంసం నుండి కోలుకోని భారత్ .. అంతలోనే మరో టెన్షన్
2021 సంవత్సరం ప్రథమార్ధంలో డెల్టా వేరియంట్ సృష్టించిన విధ్వంసం భారతదేశం ఇప్పటికీ మర్చిపోలేదు. విపరీతంగా పెరిగిన డెల్టా వేరియంట్ కేసులతో వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రులలో బెడ్లు దొరకని పరిస్థితి, ఆక్సిజన్ కోసం ప్రజలు అల్లాడిన పరిస్థితులు ఇంకా కళ్ళ ముందే కదలాడుతున్నాయి. ఇప్పుడిప్పుడే కాస్త కరోనా మహమ్మారి నుండి ఊరట లభించింది అని భావిస్తున్న సమయంలో కొత్త ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు అవటం ఆందోళనకరంగా మారింది. ఇదే సమయంలో మళ్ళీ కొత్త వేరియంట్ డెల్మీక్రాన్ కేసులు నమోదు అవుతున్నాయని జరుగుతున్న చర్చ భయబ్రాంతులకు గురి చేస్తోంది.

డెల్మీక్రాన్ వేరియంట్ పై నిర్దారించని ప్రపంచ ఆరోగ్య సంస్థ
డేటా ప్రకారం,ఒమిక్రాన్ యూఎస్ లో అత్యంత ఆధిపత్య వేరియంట్ ఇది ప్రస్తుతం మొత్తం కొత్త కేసులలో 73 శాతంగా ఉంది. ఇది నెల ప్రారంభంలో 1 శాతం కంటే తక్కువగా ఉంది. గత నెలలో యూఎస్ లో వచ్చిన 99.5 శాతానికి పైగా కోవిడ్-19 ఇన్ఫెక్షన్‌లకు డెల్టా వేరియంట్ కారణమని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. ఇదిలా ఉంటే యూఎస్ మరియు ఐరోపా లో డెల్మిక్రాన్ వేరియంట్ అభివృద్ధి చెందుతుందనే వాదనలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంకా వ్యాఖ్యానించలేదు.భారతదేశంలో, కోవిడ్-19 కోసం జాతీయ టాస్క్‌ఫోర్స్ లేదా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) "డెల్మిక్రాన్" అనే పదాన్ని ఉపయోగించలేదు. కేవలం వైద్య నిపుణుడు మరియు మహారాష్ట్ర ప్రభుత్వ కోవిడ్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు శశాంక్ జోషి మాత్రమే దీనిపై హెచ్చరిక చేశారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పబోతుందో అన్నది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది.












Click it and Unblock the Notifications