Delta Plus : ఇతర వేరియంట్ల కంటే ఊపిరితిత్తుల్లో ఎక్కువగా కేంద్రీకృతమవుతోన్న వేరియంట్
ఇతర కోవిడ్ వేరియంట్లతో పోలిస్తే డెల్టా ప్లస్ వేరియంట్ ఊపరితిత్తుల్లో ఎక్కువగా కేంద్రీకృతమవుతున్నట్లు కోవిడ్ వర్కింగ్ గ్రూప్(NTAG) ఛైర్మన్ డా.ఎన్‌కే అరోరా తెలిపారు. అంతమాత్రాన ఇది తీవ్రమైన వ్యాధికి కారణమవుతుందని లేదా ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని చెప్పలేమన్నారు.
Recommended Video
ఇతర వేరియంట్ల కంటే ఊపిరితిత్తుల్లోని శ్లేష్మ పొరలో డెల్టా ప్లస్ వేరియంట్ అధికంగా కేంద్రీకృతమవుతుందన్నారు. అయితే దీనివల్ల ఎక్కువ నష్టం ఉంటుందని గానీ నష్టం ఉండదని గానీ ఇప్పుడే చెప్పలేమన్నారు. డెల్టా ప్లస్‌కు సంబంధించి మరిన్ని కేసులను గుర్తించగలిగి... మరింత అధ్యయనం చేయగలిగితేనే దాని తీవ్రతపై స్పష్టత వస్తుందన్నారు. ఇప్పటికైతే,వ్యాక్సిన్ తీసుకున్నవారిలో దాని ప్రభావం అంతగా కనిపించడం లేదన్నారు.

డెల్టా ప్లస్ వేరియంట్‌ను ఇప్పటికే ఆందోళనకారక వైరస్‌గా గుర్తించి ఆయా జిల్లాల్లో తగిన చర్యలకు కేంద్రం ఆదేశించిందని గుర్తుచేశారు. మైక్రో ప్లాన్స్,వ్యాక్సినేషన్ ద్వారా వైరస్ కట్టడి సాధ్యపడుతుందన్నారు. కరోనా వేవ్స్ కొత్త వేరియంట్లతోనే ముడిపడి ఉండటంతో డెల్టా ప్లస్ వేరియంట్‌తో మరో వేవ్‌కు అవకాశం లేకపోలేదన్నారు. అయితే అది థర్డ్ వేవ్‌కు దారితీస్తుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు.
భారత్‌లో గతేడాది గుర్తించిన కోవిడ్ వేరియంట్ B.1.617.2ని ఇటీవల డబ్ల్యూహెచ్ఓ డెల్టా వేరియంట్‌గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఒరిజినల్ కంటే ఇది అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు తెలిపింది. ఆందోళనకర వైరస్‌గా దీన్ని గుర్తించింది. యూకెలో ఈ కేసులు ఎక్కువగా బయటపడ్డాయి. ఇదే డెల్టా వేరియంట్ ఇప్పుడు డెల్టా ప్లస్ వేరియంట్‌గా రూపాంతరం చెందింది. డెల్టా ప్లస్ లేదా AY.01గా చెబుతున్న ఈ వైరస్ కేసులు దేశంలోని మూడు రాష్ట్రాల్లో బయటపడ్డాయి.
డెల్టా వేరియంట్ కంటే దీని వ్యాప్తి రెట్టింపు ఉండొచ్చునని... రోగ నిరోధక శక్తిని సైతం ఇది తట్టుకోగలదేమోనని ఆరోగ్య నిపుణులు అంచనా వేస్తుండటంతో... థర్డ్ వేవ్ ముప్పు దీని రూపంలోనే పొంచి ఉందా అన్న చర్చ జరుగుతోంది.డెల్టా ప్లస్ వేరియంట్‌పై వ్యాక్సిన్లు పనిచేస్తాయా లేదా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. ఇప్పటికైతే డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి భారత్‌లో తక్కువగానే ఉన్నందునా అంతగా ఆందోళన చెందనక్కర్లేదన్న అభిప్రాయాలు సైంటిస్టులు వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications