Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పార్లమెంట్‌లో హత్యకు గురవుతోన్న ప్రజాస్వామ్యం: సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్

న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలి రోజు పార్లమెంట్‌లో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ సంకీర్ణ కూటమి సర్కార్ వ్యవహరించిన తీరు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. అధికార పక్ష వైఖరి పట్ల విమర్శలు ఎదురవుతోన్నాయి. పార్లమెంట్ చరిత్రలో ఓ బ్లాక్ డేగా అభివర్ణిస్తోన్నారు. ప్రజాస్వామ్యం క్రమంగా హత్యకు గురవుతోందనే ఘాటు వ్యాఖ్యలు వినిపిస్తోన్నాయి. మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరిస్తూ లోక్‌సభ, రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లు.. ఆమోదం పొందిన తీరు దిగ్భ్రాంతికి గురి చేస్తోందనే అభిప్రాయాలు ఉన్నాయి.

ఉభయ సభల్లో ఆమోదం..

ఉభయ సభల్లో ఆమోదం..

వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడానికి ఉద్దేశించిన బిల్లు- పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలి రోజే ఉభయ సభల ఆమోదం పొందిన విషయం తెలిసిందే. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. ఈ రెండు సభల్లో బిల్లును ప్రవేశపెట్టారు. ఎలాంటి చర్చ లేకుండానే దీన్ని ఆమోదించారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ఈ బిల్లు ఆమోదం పొందినట్లు ప్రకటించారు.

చర్చకు అవకాశం లేకుండా..

చర్చకు అవకాశం లేకుండా..

దీనిపై చర్చించడానికి ప్రతిపక్షాలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. వాటిని టేబుల్ చేసిన కొద్దిసేపటికే ఈ ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా ఇది సరికొత్త వివాదాన్ని సృష్టించినట్టయింది. ప్రజాస్వామ్యానికి నిలువెత్తు రూపంగా భావించే పార్లమెంట్‌లో ఎలాంటి చర్చలకు అవకాశం ఇవ్వకుండా బిల్లులను ఆమోదించడం పట్ల కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ భాగస్వామ్య పక్షాలు మండిపడుతున్నాయి. రెండో రోజు సభను అడ్డుకోవడానికి సమాయాత్తమౌతున్నాయి.

కాంగ్రెస్ సమాయాత్తం..

కాంగ్రెస్ సమాయాత్తం..

లోక్‌సభ, రాజ్యసభల్లో కాంగ్రెస్ పక్ష నేతలు అధిర్ రంజన్ చౌదరి, మల్లికార్జున ఖర్గె ఇవ్వాళ ఉభయ సభలను స్తంభింపజేయాలని నిర్ణయించుకున్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, ఎంపీ రాహుల్ గాంధీ దీన్ని ధృవీకరించారు. కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇస్తే గానీ సభా కార్యకలాపాలను సాగనివ్వబోమని హెచ్చరించారు. ఈ ఉదయం 11 గంటలకు ఉభయ సభలు సమావేశం కానున్నాయి. అంతకంటే ముందే- కాంగ్రెస్ పార్టీ తన మిత్రపక్షాలతో భేటీ కానుంది. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు చేయనుంది.

ప్రశాంత్ భూషణ్ ఆందోళన..

ప్రశాంత్ భూషణ్ ఆందోళన..

పార్లమెంట్‌లో తొలి రోజు చోటు చేసుకున్న పరిణామాల పట్ల సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరించిన తీరు తనను విస్మయ పరిచిందని వ్యాఖ్యానించారు. ఎలాంటి చర్చలు గానీ, ఓటింగ్ గానీ లేకుండా మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లును ఉభయ సభలు ఆమోదించడం అభ్యంతకరమని అన్నారు. దీనిపై చర్చించాలంటూ పట్టుబట్టిన ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేసిందని గుర్తు చేశారు.

ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారంటూ..

ఇదివరకు మూడు వ్యవసాయ చట్టాలు కూడా పార్లమెంట్ సభల్లో ఎలాంటి చర్చలు లేకుండానే ఆమోదం పొందిందని ప్రశాంత్ భూషణ్ గుర్తు చేశారు. ఇప్పుడు అదే తరహాలో- కోట్లాదిమంది రైతులకు సంబంధించిన బిల్లుల ఉపసంహరణను కూడా కేంద్ర ప్రభుత్వం అదే తరహాలో ముగించిందని విమర్శించారు. ఈ పరిణామాలు ఆందోళనలను కలిగించేవిగా ఆయన అభివర్ణించారు. ప్రజాస్వామ్యం క్రమంగా హత్యకు గురవుతోందంటూ ప్రశాంత్ భూషణ్ ఆందోళన వ్యక్తం చేశారు.

Recommended Video

    Parliament Winter Session 2021 : No Debates - New Model Of Democracy || Oneindia Telugu
    సస్పెండ్ అయిన ఎంపీలు..

    సస్పెండ్ అయిన ఎంపీలు..

    ఈ బిల్లుపై చర్చ జరపాలంటూ పట్టుబట్టిన 12 మంది రాజ్యసభ సభ్యులు సస్పెండ్‌ అయ్యారు. ఎలామరం కరీం-సీపీఎం, ఫులో దేవి నేతం, ఛాయా వర్మ, ఆర్ బోరా, రాజమణి పటేల్, సయ్యద్ నాజిర్ హుస్సేన్, అఖిలేష్ ప్రసాద్ సింగ్-కాంగ్రెస్, బినోయ్ విశ్వం-సీపీఐ, డోలా సేన్, శాంతి ఛత్రి-తృణమూల్ కాంగ్రెస్, ప్రియాంక చతుర్వేది, అనిల్ దేశాయ్- శివసేన సస్పెండ్ అయ్యారు. సభ కార్యకలాపాలను అడ్డుకున్నారనే కారణంతో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ వారిని సస్పెండ్ చేశారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+