వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేప్ ఆరోపణలతో కలత: ఎన్జీవో ఎగ్జిక్యూటివ్ ఆత్మహత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

NGO executive commits suicide
న్యూఢిల్లీ: తనపై అత్యాచారం ఆరోపణలు రావడంతో తీవ్రంగా కలత చెందిన ఎన్జీవో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న 55 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను తనపై అత్యాచారం చేసినట్లు ఓ అమ్మాయి ఫిర్యాదు చేసింది. ఖుర్షీద్ అన్వర్ అనే ఆ వ్యక్తి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

అన్వర్ ప్రభుత్వేతర సంస్థ (ఎన్జీవో)ను నడుపుతున్నాడు. అతను దక్షిణ ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలోని భవనం రెండో అంతస్థులో నివాసం ఉంటున్నాడు. అతను ఆ భవనం రెండో అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అన్వర్ కిందికి దూకుతుండగా పక్కనే నిర్మాణం పనిలో ఉన్న కార్మికుడు చూశాడు.

అతను విషయాన్ని ఇరుగుపొరుగువారికి చెప్పాడు. వారి సాయంతో అన్వర్‌ను అస్పత్రికి చేర్చాడు. అయితే, అతను అప్పటికే మరణించాడని వైద్యులు తేల్చారు. డెయిరీలో అన్వర్ రాసిన మూడు పేజీలో నోట్ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.

మరో ఎన్జీవోల సభ్యురాలిగా ఉన్న అమ్మాయి తనను లక్ష్యం చేసుకుందని అతను ఆ నోట్‌లో రాశాడు. ఆరోపణలతో తాను తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కూడా రాశాడు. తన తప్పేమీ లేకున్నా తనపై అమ్మాయి ప్రచారం చేస్తున్న తీరుకు తీవ్రంగా కలత చెందానని, తన 30 ఏళ్ల ప్రతిష్టను, కెరీర్‌ను మంట గలిపే పని పెట్టుకుందని అతను ఆ నోట్‌లో ఆరోపించాడు.

పోలీసులు మంగళవారం అన్వర్‌పై అత్యాచారం కేసు నమోదు చేశారు. అన్వర్ ఎన్జీవోకు చెందిన సభ్యులతో తాను సెప్టెంబర్ 12వ తేదీన పార్టీకి హాజరయ్యానని, పార్టీలో తాను తాగి వాంతులు చేసుకున్నానని, దాంతో అన్వర్ నివాసంలో ఉండిపోవాలని తనకు చెప్పారని, తాను అంగీకరించానని ఆ అమ్మాయి తన ఫిర్యాదులో వివరించింది.

తాను నిద్రపోయానని, తెల్లారి లేచేసరికి తనపై లైంగిక దాడి జరిగినట్లు గుర్తించానని, బయటకు చెప్తే పరువు పోతుందని మౌనంగా ఉండిపోయానని ఆమె చెప్పింది. కొద్ది రోజుల క్రితం అమ్మాయి జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదును కమిషన్ పోలీసులకు పంపించింది.

English summary
A 55-year-old executive director of an NGO committed suicide by jumping off a building here after becoming depressed when a girl accused him of rape, police said on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X