జైలులో డేరాబాబా దినచర్య ఇలా, పండ్లు, జ్యూస్ మాత్రమే

డేరాబాబాకు జైలులో పండ్ల రసాలు తీసుకొంటున్నారు. అయితే జైలులో ఖైదీలకు ఇచ్చే రొట్టెలను మాత్రం తినేందుకు ఇష్టపడడం లేదు. మరోవైపు డేరా బాబా తన అనుచరులెవరినీ కలుసుకోలేదు.

రోహతక్: డేరాబాబాకు జైలులో పండ్ల రసాలు తీసుకొంటున్నారు. అయితే జైలులో ఖైదీలకు ఇచ్చే రొట్టెలను మాత్రం తినేందుకు ఇష్టపడడం లేదు. మరోవైపు డేరా బాబా తన అనుచరులెవరినీ కలుసుకోలేదు. వివిధ కారణాల రీత్యా పోలీసులు ఇంతవరకూ బాబాను కలుసుకునేందుకు ఎవరికీ అనుమతినివ్వలేదు.

సాధ్వీల అత్యాచారం కేసులో డేరా బాబాకు 20 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఆగష్టు 25వ, తేదిన డేరాబాబాకు శిక్ష పడింది. శిక్ష పడిన తర్వాత బాబాను సునారియా జైలుకు తరలించారు.

డేరాబాబాను జైలుకు తరలించిన తర్వాత కోర్టు ఆదేశాల మేరకు రామ్ రహీమ్ సింగ్ ఆశ్రమంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అనేక ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.

డేరా తన ఆశ్రమంలో మరో ప్రపంచాన్ని నడుపుతున్నారని తేలింది. డేరాలో సోదాలు ముగిశాయి. ఈ మేరకు ఆశ్రమంలో భారీగా ఆయుధాలు, నగదును కూడ స్వాధీనం చేసుకొన్నారు.

ఫ్రూట్ జ్యూస్ కావాలని డేరా బాబా డిమాండ్

ఫ్రూట్ జ్యూస్ కావాలని డేరా బాబా డిమాండ్

గత నెల 25వ, తేదిన డేరా బాబాను అరెస్ట్ చేశారు. అయితే తాను 10 మందిని కలుసుకోవాలనుకుంటున్నానని బాబా చెప్పాడు. కాగా గుర్మీత్ రామ్ రహీం సునారియా జైలుకు వచ్చిన తొలిరోజు అతని అకౌంట్‌లో జైలు అధికారులు రూ 18 వేలు జమచేశారు. ఈ సొమ్ముతో డేరాబాబా క్యాంటీన్‌లో పండ్లు, ఫ్రూట్ జ్యూస్ తీసుకునే అవకాశం లభిస్తుంది.డేరా బాబాకు జైలులోని రొట్టెలు ఎంతమాత్రం రుచించడం లేదు. సిబ్బంది ఎంతగా చెప్పినప్పటికీ కొద్దిగానే రొట్టెలు తీసుకుంటున్నాడు.

డేరా బాబా దినచర్య ఇలా

డేరా బాబా దినచర్య ఇలా

జైలులో ఉదయం 5 గంటలకు మేల్కొలుపుతారు. 6 గంటలకు అధికారుల ముందు హాజరౌతారు. ఉదయం 6.30కి బ్రేక్ ఫాస్ట్... దీనిలో టీ, బ్రెడ్ ఇస్తారు. అయితే కోర్టుకు ప్రతిరోజూ ఖైదీలను తీసుకెళ్తుంటారు. దీంతో ప్రతిరోజూ ఉదయం 9 గంటలకల్లా ఖైదీలందరికీ లంచ్ ఇస్తారు.ఆ సమయంలో బాబా జైలులోని క్యాంటీన్‌లో పండ్లు, పండ్ల రసాలు తీసుకునేందుకు వెళతాడు.

క్యాంటీన్‌లో లడ్డూలు, సమోసా

క్యాంటీన్‌లో లడ్డూలు, సమోసా

జైలు క్యాంటీన్‌లో బిస్కట్లు, నమ్కీన్, పండ్లు, జ్యూస్, లడ్డూ, సమోసా, నూడుల్స్ మొదలైన ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటాయి.మధ్యాహ్నం 3.30కి టీ అందిస్తారు.సాయంత్రం 7.30కి డిన్నర్ ఇస్తారు.సమయం ప్రకారంగానే జైలులో ఖైదీలకు అన్ని సమకూరుస్తారు. ఖైదీలకు ఇచ్చే మెనూ నచ్చకపోవడంతో క్యాంటీన్‌లోకి వెళ్ళి డేరాబాబా తనకు నచ్చిన వాటిని కొనుగోలు చేసి తింటున్నారని అధికారులు చెబుతున్నారు.

భద్రతా కారణాలతో ఎవరికి అనుమతివ్వలేదు

భద్రతా కారణాలతో ఎవరికి అనుమతివ్వలేదు

బాబా .జైలులో ఉన్న కారణంగా ఇతర ఖైదీలు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. వారిని కూడా బ్యారక్ నుంచి బయటకు వెళ్లనివ్వడం లేదు.
సునారియా జైలుకు బాబా వచ్చిననాటి నుంచి.. ఇప్పటివరకూ మరో కొత్త ఖైదీనెవరినీ జైలులోనికి తీసుకురాలేదు.షుగర్, బీపీ ఉన్నకారణంగా బాబాకు రెండుసార్లు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. భద్రతా కారణాల రీత్యా బాబా ఇప్పటివరకూ ఎవరినీ కలుసుకునేందుకు అనుమతివ్వలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+