Devadasi: దేవుడికి 22 ఏళ్ల అమ్మాయిని ఇచ్చేసిన ఫ్యామిలీ, 40 ఏళ్ల క్రితం నిషేధించినా ?
బెంగళూరు/కోప్పళ: ఓ రాష్ట్రంలో దేవదాసీ వ్యవస్థ సజీవంగా ఉందని వెలుగు చూసింది. 22 ఏళ్ల యువతిని ఆమె తల్లిదండ్రులు దేవుడికి సమర్పించి ఆమెను దేవదాసిని చేసేశారు. దేవదాసి కేసుకు సంబంధించి ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశామని, కేసు విచారణలో ఉందని కోప్పళ పోలీసులు అంటున్నారు. దేవదాసీ వ్యవస్థను నిషేధించి 40 ఏళ్లు గడుస్తున్నా నేటికీ ఈ దుర్మార్గపు విధానం కొనసాగుతుండటం సిగ్గుచేటు అని ప్రజలు మండిపడుతున్నారు.

కొన్ని నెలలకు బయటపడింది
మే నెలలో జరిగినట్లు చెబుతున్న ఈ ఘటనను కొప్పళ జిల్లాకు చెందిన గ్రామస్థులు జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దేవదాసి సంరక్షణ ప్రాజెక్టు అధికారిణి పూర్ణిమ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొప్పళ జిల్లా మునీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి 22 ఏళ్ల యువతి తల్లిదండ్రులు, బాలిక అక్కతో సహా ముగ్గురిని అరెస్టు చేశారు. నాలుగో నిందితుడైన యువతి బావ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కుటుంబ సభ్యులు అందరూ కలిసి యువతిని దేవదాసి చేశారని వెలుగు చూసింది.

మూడనమ్మకాలతో ?
స్త్రీని దేవుడికి నైవేద్యంగా సమర్పించినట్లయితే, ఆమె దీర్ఘకాలిక అనారోగ్యం నుండి బయటపడుతుందని ఆమె తల్లిదండ్రులు విశ్వసించారు. పెళ్లికాని అమ్మాయి మంగళసూత్రం మరియు దేవదాసీల సంప్రదాయ దుస్తులు ధరించడం ప్రారంభించడంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చి సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగు చూసింది.

అధికారుల ఎంట్రీతో ?
అనంతరం అప్రమత్తమైన గ్రామస్తులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయగా అధికారులు ఇంటింటికి వెళ్లి విషయం బయటకు లాగారు. అనంతరం యువతి కుటుంబసభ్యులు నేరం అంగీకరించినట్లు సమాచారం. మహిళ లైంగిక వేధింపులకు గురైందా లేదా అనే విషయాన్ని పరిశీలించేందుకు ఆమెకు వైద్యపరీక్ష నిర్వహిస్తున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పద్మావతి మీడియాకు చెప్పారు.

కోలుకుంటున్న యువతి
22 ఏళ్ల యువతి హిమోగ్లోబిన్‌తో బాధపడుతున్నదని, తక్కువ బరువుతో ఉండటంతో ఆమె కుటుంబ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దేవదాసికి ప్రతీకగా భావించిన తల్లిదండ్రులు వైద్యం చేయించకుండా తమ కుమార్తెను దేవదాసి ఆచారానికి అందించారు. అల్లిన జుట్టు బరువు కారణంగా తిన్న ప్రతిసారీ మహిళ తల తిరగడం, వాంతులు అవుతోందని కుటుంబ సభ్యులు చెప్పారని అధికారులు అంటున్నారు. 22 ఏళ్ల మహిళను దేవదాసి పద్ధతికి గురిచేసిన కుటుంబంపై కేసు నమోదైంది. మహిళా శిశు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహిళ కోలుకుంటున్నట్లు కొప్పళ జిల్లా ఎస్పీ అరుణంగాశు గిరి మీడియాకు చెప్పారు.












Click it and Unblock the Notifications