Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇండిగో సంస్థకు భారీ జరిమానా.. కారణం ఇదే..

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) ఇండిగో సంస్థకు బిగ్ షాక్ ఇచ్చింది. ఇండిగో సంస్థకు రూ. 20 లక్షల జరిమానా విధించింది. కేటగిరీ సీ ఎయిర్ పోర్ట్స్ లో పైలట్లకు ట్రైనింగ్ సరైన విధంగా చేయని కారణంగా జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే డీజీసీఏ నిర్ణయాన్ని ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ సవాల్ చేసింది. ఈ మేరకు అప్పిలేట్ ట్రైబ్యూనల్ లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధం అవుతోంది. డీజీసీఏ నిర్ణయం కారణంగా ఇండిగో విమానాల రాకపోకలకు, షెడ్యూల్, టైమింగ్స్ కు ఎలాంటి అడ్డంకులు ఉండవని.. విమాన సేవలు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.

ఇండిగో సంస్థలో కేటగిరీ సీ ఎయిర్ పోర్ట్స్ లోని పైలట్లకు నాణ్యమైన ట్రైనింగ్ ఇవ్వలేదన్న కారణంతో ఇండిగో సంస్థపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) భారీ జరిమానా విధించింది. రూ. 20 లక్షల జరిమానా విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సిమ్యులేటర్స్ ను ఉపయోగించి పైలట్లకు శిక్షణ ఇవ్వడంతో సంస్థ విఫలం అయినట్లు డీజీసీఏ పేర్కొంది. పైలట్ల శిక్షణలో ఇండిగో నాణ్యత ప్రదర్శించలేదని అభిప్రాయపడింది. ఎయిర్ లైన్స్ ట్రైనింగ్ రికార్డ్స్ లోని రెగ్యులేటర్స్ ప్రకారం.. 1700 లకు పైగా పైలట్లు, కమాండర్లు, ఫస్ట్ ఆఫీసర్లతో కేటగిరి సీ విమానాశ్రయాల్లో శిక్షణ కోసం ధృవీకరించని ఫుల్ ఫ్లైట్ సిమ్యూలేటర్లను ఉపయోగించినట్లు తేలిందని డీజీసీఏ పేర్కొంది.

DGCA Jolts IndiGo Slaps Rs 20 Lakh Fine for Regulatory Violations

ఇదే విషయంపై ఇండిగో స్పందించింది. డీజీసీఏ నిర్ణయాన్ని సవాల్ చేసింది. ఈ జరిమానా తమ ఆర్థిక, కార్యాచరణ, ఇతర వ్యాపార కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం చూపదని ఎయిర్‌ లైన్ సంస్థ తెలిపింది. అయితే గతంలోనూ డీజీసీఏ.. ఇండిగో సంస్థపై జరిమానాలు విధించింది. ప్రస్తుతం విమాన ప్రమాదాలు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో వైమానిక భద్రత, సిమ్యులేషన్ పరీక్షల్లో నాణ్యతపై అవసరాలను నొక్కి చెబుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+