10 లక్షల ఇన్సూరెన్స్ కోసం కొడుకుని చంపిన తల్లి

న్యూఢిల్లీ: రూ. 10 లక్షల ఇన్సూరెన్స్ కోసం కన్న కొడుకునే ఓ మహిళ చంపిన ఘటన మహారాష్ట్రలోని పూణెలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పూణెకి చెందిన చైతన్య బల్‌పాండే (13) పుట్టుకతోనే పాక్షికంగా అంగవైకల్యం కలిగి ఉన్నాడు.

దీంతో బాలుడి తండ్రి అతని పేరు మీద రూ. 10 లక్షలు ఇన్సూరెన్స్ చేశాడు. ఆ ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేసుకునేందుకు గాను బాలుడి తల్లి రాఖీ గత వారం తన స్నేహితుడితో కలిసి దారుణంగా కొట్టి చంపేసింది. అనంతరం ఈ సంఘటనను కన్న కొడుకు మరణాన్ని ప్రమాదవశాత్తూ సంభవించినదిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది.

Did Monster Mom Kill 13-Year-Old for Rs. 10-Lakh Insurance?

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు ఇన్సూరెన్స్ కోసమే అతని తల్లి రాఖీ కుమారుడిని చంపేసిందని పోలీసులు భావిస్తున్నారు. చైతన్య బల్‌పాండే తల్లిదండ్రులు విడాకులు తీసుకోగా, చైతన్య తల్లి రాఖీ వద్ద ఉంటున్నాడు. ఈ ఘటనపై స్ధానికులు మాట్లాడుతూ రాఖీ కుమారుడిని చిత్రహింసలకు గురిచేసేదని ఆరోపించారు.

అంతేకాదు రాఖీ తల్లి బాలుడిని కాపాడేందుకు తన వెంట తీసుకేళ్లేందుకు ప్రయత్నించగా, రాఖీ ఒప్పుకోలేదని కిడ్నాప్ కేసు పెడతానని బెదిరించిందని పోలీసులు విచారణలో వెల్లడైంది. బాలుడు చైతన్యను కాపాడేందుకు చుట్టుప్రక్కల వారు ప్రయత్నిస్తే వారిపై కూడా బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తుని వివిధ కోణాల్లో చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+