ఎవరీ భండారీ: 1963లో నేతాజీ ఆశ్రమంలో ఉన్నారా?
కోల్‌కతా: నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి మరో షాకింగ్ విషయం వెలుగు చూసినట్లుగా తెలుస్తోంది. 1963లో నేతాజీ... కేకే భండారీగా ఉత్తర బెంగాల్లోని శలుమరి ఆసుపత్రిలో జీవించారా? అంటే అవుననే అంటున్నారు.
తాజాగా బయటపడిన నేతాజీ ఫైల్స్ చూస్తే ఈ అనుమానాలకు బలం చేకూరుతుంది. 1940లో విమాన ప్రమాదంలో నేతాజీ చనిపోయారని భావిస్తూ ఉండగా, ఆ తర్వాత కూడా ఆయన బతికే ఉన్నారనే వాదనలు తరచూ వినిపిస్తున్నాయి.
1963లో శలుమరి ఆశ్రమంలో ఉన్న కెకె భండారీ అనే వ్యక్తే నేతాజీ అని కొందరి అనుమానిస్తున్నారు. మూడు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం బహిర్గతం చేసిన కొన్ని ఫైల్స్ ఈ అనుమానాలను బహిర్గం చేస్తున్నాయి.

శలుమరి ఆశ్రమంలో నిర్వాహకుడు రమణి రంజన్ దాస్ 1963లో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు ఒక లేఖ రాశారు. ఆశ్రమంలో ఉన్న కెకె భండారీపై ఆయన సమాచారం అందించారు. ఆయనే నేతాజీ అయి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తం చేశారు.
దీనికి సంబంధించిన ఇంటెలిజెన్స్ బ్యూరో, ప్రధాని కార్యాలయం మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. తర్వాత ఈ విషయం మరుగున పడింది. ఆ తర్వాత ప్రచారంలో ఉన్న వయ్క్తి నేతాజీ కాదని ఓ కమిషన్ నివేదిక సమర్పించింది. తాజాగా ఇప్పుడు ఫైల్స్ బయటపడటంతో అసలు భండారీ ఎవరనే చర్చ ప్రారంభమైంది.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications