వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దీదీ.. మీ కాలుతో నా తలపై తన్నండి -బెంగాల్ ప్రచారంలో ప్రధాని మోదీ అనూహ్య వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

ఎన్నికల తేదీ సమీపిస్తున్నకొద్దీ వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు దిగిరాగా.. వారితో తలపడుతున్నట్లుగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం పోటాపోటీగా ఆదివారం భారీ బహిరంగ సభలు నిర్వహించారు. బంకురా జిల్లా కేంద్రంలో బీజేపీ ఏర్పాటు చేసిన ర్యాలీలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ అనూహ్య వ్యాఖ్యలు చేశారు.

 నేనో పెద్ద గాడిదను -ద్రోహుల్ని గుర్తించలేకపోయా -బెంగాల్ సీఎం మమత -సువేందు అవినీతి రూ.5వేల కోట్లు నేనో పెద్ద గాడిదను -ద్రోహుల్ని గుర్తించలేకపోయా -బెంగాల్ సీఎం మమత -సువేందు అవినీతి రూ.5వేల కోట్లు

మమత పాలనలో బెంగాల్ పూర్తిగా ఆగమైపోయిందని, టీఎంసీ అడుగడుగునా అవినీతి, అక్రమాలకు పాల్పడిందని ఆరోపించిన ప్రధాని మోదీ.. నిజమైన అభివృద్ధి అంటే ఏమిటో చెప్పడాకే బెంగాల్ వచ్చానని, అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న మమతను తొలగించాలని ప్రజలు ఇప్పటికే డిసైడయ్యారని అన్నారు. మమతను ఉద్దేశించి.. ''దీదీ.. మీరు నా తలపై కాలు పెట్టండి, తన్నండి, కానీ, బెంగాల్ అభివృద్ధి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చకుండా మాత్రం నన్ను ఆపలేరు'' అని మోదీ వ్యాఖ్యానించారు.

Didi, put your foot over my head and kick me but not Bengals development says PM Modi

మోదీ మొఖం చూస్తేనే కంపరంగా ఉంటుందన్న మమత మరో వ్యాఖ్యను కూడా ప్రధాని ప్రస్తావించారు. ప్రజాస్వామ్యంలో ముఖం కంటే ప్రజాసేవ ముఖ్యమన్నారు. గడిచిన పదేళ్లుగా ఉత్తుత్తి హామీలతోనే మమత కాలం వెళ్లదీస్తున్నారని, నిజంగా ప్రజలకు ఏమేమీ మంచి పనులు చేశారో చెప్పాలని మోదీ నిలదీశారు. ఆట మొదలైందని దీదీ చెబుతున్నా, ఆమె ఆటనే ముగిసిందని ప్రజలు చెప్పబోతున్నారని మోదీ అన్నారు.

తిరుపతి పోరు: బీజేపీ సంచలనం -జనసేనకు విడిగా సొంత కమిటీ -దాసరికి చోటు -టికెట్ రత్నప్రభకే!తిరుపతి పోరు: బీజేపీ సంచలనం -జనసేనకు విడిగా సొంత కమిటీ -దాసరికి చోటు -టికెట్ రత్నప్రభకే!

బెంగాల్ అభివృద్దికి బీజేపీ కట్టుబడి ఉందని, రాబోయే ఎన్నికల్లో మార్పు కోసం జనమంతా ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారని ప్రధాని మోదీ తెలిపారు. మొత్తం 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీకి మొత్తం 8 దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. తొలి దశ పోలింగ్ ఈనెల 27న జరుగనుంది. టీఎంసీ, బీజేపీ మధ్య ప్రధాన పోటీ కొనసాగుతుండగా, లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ తో కలిసి బరిలో దిగాయి.

English summary
Prime Minister Narendra Modi's political attack on Sunday centered around West Bengal Chief Minister Mamata Banerjee as he addressed a rally in Bankura. Taking potshots at the Trinamool supremo, Modi said that graffiti on Bengal streets shows Mamata hitting him and playing football, and asked why was she insulting the state culture and traditions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X