నెలవారీ రేషన్ రావట్లేదా ? ప్రభుత్వాన్ని పరిహారం కోరవచ్చు-ఆహార భద్రత చట్టం ఏం చెబుతోంది ?

మన దేశంలో చట్టాలు పౌరులకు ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నా వాటిపై సరైన అవగాహన లేక వారు సద్వినియోగం చేసుకోవడం లేదనే అంశం ఎప్పటికప్పుడు నిరూపితమవుతూనే ఉంది. నెలవారీ ప్రభుత్వం ఇచ్చే రేషన్ ను అందుకోలేని పేదలు ఎందరో ఈ దేశంలోనే ఉన్నారు. మరోవైపు అదే రేషన్ ను వారి పేరు చెప్పి అమ్ముకుతింటున్న అక్రమార్కులు అంతకంటే ఎక్కువ ఉన్నారు. కానీ రేషన్ రాకపోతే ప్రభుత్వాన్ని పరిహారం కోరే అవకాశం ఉందని మీకు తెలుసా ?

నెలవారీ రేషన్ రాకపోతే ?

నెలవారీ రేషన్ రాకపోతే ?

ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్ధ ద్వారా పేదలకు ఆహార ధాన్యాలు, కొన్ని రాష్ట్రాల్లో వంటనూనెల్ని సైతం ఉచితంగా సరఫరా చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం నేరుగా కొన్ని సరుకులు పంపుతుంటే, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చోట్ల యథాతథంగా, మరికొన్ని చోట్ల మరికొన్ని అదనపు సరుకులు కలిపి ఇస్తున్నాయి. అంతిమంగా పేదల ఆకలి తీర్చాలన్నదే ఈ నెలవారీ రేషన్ ఉద్దేశం. మరి అలాంటి రేషన్ రాకపోతే ఏం చేయాలన్న దానిపై మాత్రం పేదలకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. దీంతో పేదలు ఇంకా రేషన్ దుకాణాల చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉన్నారు.

ప్రభుత్వాన్ని పరిహారం కోరవచ్చు..

ప్రభుత్వాన్ని పరిహారం కోరవచ్చు..

మన దేశంలో పేదలు తమకు నెలవారీ అందాల్సిన రేషన్ అందకపోతే పరిహారం కోరే అవకాశం ఉంది. రేషన్ ఇవ్వకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంది. పరిహారం తీసుకునే హక్కు ఉంది. అవును ఇది నిజం. ఎప్పుడో 19 ఏళ్ల క్రితం అమల్లోకి వచ్చిన ఆహార భద్రత చట్టమే ఇందుకు అవకాశం కల్పిస్తోంది. కానీ ప్రజలు మాత్రం దీన్ని సద్వినియోగం చేసుకోవడం లేదు. దీనికి అవగాహన లేమే కారణంగా కనిపిస్తోంది. కానీ రేషన్ షాపు నుంచి నెలవారీ ఆహారధాన్యాల కేటాయింపులు రాకుంటే ప్రభుత్వం నుంచి పరిహారం కోరవచ్చనే అంశాన్ని తాజాగా కేరళలో 25 మంది వ్యక్తులు నగదు పరిహారం అందుకుని నిరూపించారు.

ఆహార భద్రతా చట్టం ఏం చెబుతోంది ?

ఆహార భద్రతా చట్టం ఏం చెబుతోంది ?

జాతీయ ఆహార భద్రతా చట్టం, 2003 ప్రకారం అందించబడిన హక్కుల్లో ఆహార భద్రతా భత్యం అనే నగదు పరిహారం కూడా ఒకటి. ఈ పథకం ప్రాధాన్యతా వర్గం కిందకు వచ్చే కార్డ్-హోల్డర్లకు మాత్రమే పరిమితం చేశారు. ప్రాధాన్యత కలిగిన కార్డుదారులు ఆహార ధాన్యాలు అందని పక్షంలో జిల్లా ఫిర్యాదుల పరిష్కార అధికారికి DGROకు ఫిర్యాదు చేయవచ్చు. ప్రభుత్వం నియమించే అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (జిల్లా కలెక్టరేట్‌లో ADM)గా ఉంటారు. DGRO తీర్పుతో పిటిషనర్ సంతృప్తి చెందకపోతే, రాష్ట్ర ఆహార కమిషన్‌లో అప్పీల్ దాఖలు చేయవచ్చు. తాజాగా కేరళలో రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ కెవి మోహన్ కుమార్ .. "ఆహార భద్రతా భత్యం నిబంధన గురించి చాలా మందికి తెలియదని, అందుకే చాలామంది మిస్సవుతున్నారని తెలిపారు. ఇలాంటి కేసులను డీజీఆర్వోలకు నివేదించాలని జిల్లా సరఫరా అధికారులను కమిషన్ ఆదేశించిందన్నారు. ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని డిజిఆర్‌ఓలను ఆయన కోరారు.
నిజమైన ఫిర్యాదులపై, ఆ తర్వాత నెల మూడో వారం ముగిసేలోపు నష్టపరిహారం మంజూరు చేస్తారు. రేషన్ షాపును సందర్శించని వ్యక్తులు, నాణ్యత లేదని పేర్కొంటూ కేటాయింపులను తిరస్కరించిన వారు మాత్రం దీనికి అర్హులు కాదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+