వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమన్వయ భేటీ: సహకరించాలని కిరణ్‌తో దిగ్విజయ్

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన వ్యవహారాలతో దేశ రాజధాని ఢిల్లీ వేడెక్కింది. ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో సమావేశమైన కాంగ్రెసు రాష్ట్ర సమన్వయ కమిటీపై తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ ఉత్కంఠ ఏర్పడింది. విభజన ప్రక్రియకు సహకరించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్‌కు నచ్చజెప్పేందుకే సమన్వయ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో దాదాపు రెండు గంటల పాటు సమావేశం జరిగింది.

దిగ్విజయ్ సింగ్ అధ్యక్షతన ఏర్పాటైన సమావేశానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, కేంద్ర మంత్రి చిరంజీవి, తదితరులు హాజరయ్యారు. నెలాఖరులో తెలంగాణ బిల్లు రాష్ట్ర శానససభకు వెళ్తుందని దిగ్విజయ్ సింగ్ సమావేశానికి ముందు అన్నారు. సంస్థాగత విషయాలపైనే చర్చిస్తామని కూడా ఆయన అన్నారు. ఆంటోనీ కమిటీ సోనియాకు నివేదిక ఇస్తుందని ఆయన అన్నారు.

అయితే, రాష్ట్ర విభజనను ఆపేది లేదని, సహకరించాలని, సహకరిస్తే మీకు కూడా మంచిదని, సహకరించకపోయినా విభజన ప్రక్రియపై ముందుకు సాగుతామని దిగ్విజయ్ సింగ్ కిరణ్ కుమార్ రెడ్డికి పరోక్షంగా చెప్పినట్లు తెలుస్తోంది. సమావేశం నుంచి దామోదర రాజనర్సింహ, దామోదర రాజనర్సింహ, బొత్స సత్యనారాయణ వెళ్లిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి మిగతా వారున్నారు.

Digvijay - Kiran

సమావేశంలో దామోదర రాజనర్సింహకు, కిరణ్ కుమార్ రెడ్డికి మధ్య వాగ్వివాదం జరిగినట్లు చెబుతున్నారు. చిరంజీవి, బొత్స సత్యనారాయణ ఏమీ మాట్లాడలేదని అంటున్నారు. సమావేశంలో ఎక్కువగా దిగ్విజయ్ సింగ్ మాట్లాడారని చెబుతున్నారు.

అయితే, కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఉదయం నుంచి కూడా మీడియాతో మాట్లాడడానికి నిరాకరిస్తూ వచ్చారు. తర్వాత మాట్లాడుతానంటూ సైగల ద్వారా సూచిస్తూ వచ్చారు. సమన్వయ కమిటీ సమావేశానికి ముందు ఆయన జివోఎం సభ్యుడు జైరాం రమేష్‌ను ఆయన కలిశారు. ఆ తర్వాత దిగ్విజయ్ సింగ్‌తో సమావేశమయ్యారు. బొత్స, చిరంజీవి, దామోదర కూడా దిగ్విజయ్‌తో సమావేశమయ్యారు.

జలాల పంపిణీపై, హైదరాబాద్ స్థితిపై సమావేశంలో చర్చ జరిగినట్లు చెబుతున్నారు. రెండు పిసిసిల ఏర్పాటు కూడా సమావేశంలో చర్చించినట్లు సమాచారం. రేపు కూడా కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స, దామోదర రాజనర్సింహ ఢిల్లీలోనే ఉండే అవకాశాలున్నాయి.

English summary
It is said that Congress Andhra Pradesh affairs incharge suggested CM Kiran kumar Reddy to cooperate for the creation of Telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X