వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నటి కిడ్నాప్, లైంగిక వేధింపులు, నా కొడుకు అమాయకుడు, కేరళ సీఎంకు దిలీప్ తల్లి లేఖ !

ప్రముఖ నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో తన కుమారుడు, నటుడు దిలీప్ కు ఎలాంటి సంబంధంలేదని, అతను అమాయకుడని, దయచేసి జైలు నుంచి విడుదల కావడానికి బెయిల్ మంజూరు చెయ్యాలని ప్రముఖ మలయాళం నటుడు దిలీప్ తల్లి .

|
Google Oneindia TeluguNews

కొచ్చి: ప్రముఖ నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో తన కుమారుడు, నటుడు దిలీప్ కు ఎలాంటి సంబంధంలేదని, అతను అమాయకుడని, దయచేసి జైలు నుంచి విడుదల కావడానికి బెయిల్ మంజూరు చెయ్యాలని ప్రముఖ మలయాళం నటుడు దిలీప్ తల్లి సరోజం పిళ్లై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు లేఖ రాశారు.

నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసు: కేరళ ఎమ్మెల్యే మీద కేసు, సినిమాల్లో అర్దనగ్నంగా నటిస్తారు!నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసు: కేరళ ఎమ్మెల్యే మీద కేసు, సినిమాల్లో అర్దనగ్నంగా నటిస్తారు!

ప్రముఖ నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసులో మలయాళం సూపర్ స్టార్ దిలీప్ ను గత నెల కేరళ పోలీసులు అరెస్టు చేశారు. రిమాండ్ ఖైదీగా దిలీప్ ఆలువా సబ్ జైల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. నెల రోజులకు పైగా ఆలువా సబ్ జైల్లో ఉన్న దిలీప్ కు బెయిల్ మంజూరు చెయ్యాలని ఆయన తల్లి సరోజం పిళ్లై మనవి చేస్తున్నారు.

దిలీప్ అలాంటి వ్యక్తి కాదు

దిలీప్ అలాంటి వ్యక్తి కాదు

సినిమా రంగంలో ఎన్నో సంవత్సరాలు ఎలాంటి మచ్చ లేకున్నా ఉన్న దిలీప్ సాటి నటిని కిడ్నాప్ చేయించి లైంగిక దాడి ఎందుకు చేయిస్తాడని ఆయన తల్లి సరోజం పిళ్లై అంటున్నారు. దిలీప్ నేరాలకు పాల్పడే వ్యక్తి కాదని, కేసు విచారణ తప్పుదోవ పడుతోందని ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సరోజం పిళ్లై మనవి చేస్తున్నారు.

Recommended Video

Actress Abduction; Pulsar Suni Involvement Reveals | Oneindia Telugu
మరోసారి విచారణ జరిపించండి

మరోసారి విచారణ జరిపించండి

ప్రముఖ నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసులో మరోసారి విచారణ జరిపించడానికి కేరళ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని దిలీప్ తల్లి సరోజం పిళ్లై సీఎం పినరయి విజయన్ కు మనవి చేస్తూ లేఖ రాశారు. దిలీప్ తల్లి సరోజం పిళ్లై లేఖ రాశారని కేరళ సీఎం కార్యాలయం దృవీకరించింది.

నటి లేఖ రాసిన మరుసటి రోజే

నటి లేఖ రాసిన మరుసటి రోజే

కేరళ ఎమ్మెల్యే పీసీ జార్జ్ వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా కేసు తప్పుదోవ పడుతోందని, ఆయన మీద చర్యలు తీసుకోవాలని బాధిత నటి కేరళ సీఎం పినరయి విజయన్ కు లేఖ రాసిన మరుసటి రోజే దిలీప్ తల్లి సరోజం పిళ్లై సీఎంకు లేఖ రాయడం గమనార్హం.

ప్రభుత్వానికి మనవి చేసిన నటి

ప్రభుత్వానికి మనవి చేసిన నటి

ఎమ్మెల్యే పీసీ జార్జ్ మీద ఇప్పటికే కేరళ మహిళ కమిషన్ కేసు నమోదు చేసి విచారణ చేస్తోంది. తన మీద అనుచుతి వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే పీసీ. జార్జ్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని, కేసు తప్పుదోవ పట్టకుండా చూడాలని బాధిత నటి కేరళ ప్రభుత్వానికి మనవి చేస్తూ లేఖ రాశారు.

రూ. 1.50 కోట్లు డీల్ జరిగింది

రూ. 1.50 కోట్లు డీల్ జరిగింది

ప్రముఖ హీరో దిలీప్ ప్రముఖ నటిని లైంగిక వేధింపులకు గురి చేస్తే మాకు రూ. 1.50 కోట్లు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారని ఇప్పటికే అరెస్టు అయిన ప్రముఖ నిందితుడు సునీల్ కుమార్ అలియాస్ పల్సర్ సునీ అంగీకరించడాని కేరళ పోలీసులు అంటున్నారు.

కేరళ హైకోర్టు

కేరళ హైకోర్టు

ప్రముఖ నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన దిలీప్ తనకు బెయిల్ మంజూరు చెయ్యాలని ఇప్పటికే మూడు సార్లు కోర్టును ఆశ్రయించారు. దిలీప్ కు బెయిల్ మంజూరు చెయ్యడానికి కేరళ హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే.

కౌంటర్ దాఖలు చేసిన పోలీసులు

కౌంటర్ దాఖలు చేసిన పోలీసులు

దిలీప్ కు బెయిల్ మంజూరు చెయ్యడానికి నిరాకరించిన కేరళ హైకోర్టు కేసు విచారణ ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. బెయిల్ ఎందుకు మంజూరు చెయ్యకూడదు అని వివరణ ఇవ్వాలని పోలీసులకు కేరళ హైకోర్టు సూచించింది. దిలీప్ కు బెయిల్ మంజూరు చెయ్యకూడదని పూర్తి వివరాలతో కేరళ పోలీసులు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో హీరో దిలీప్, పల్సర్ సునీతో పాటు మొత్తం ఏడు మందిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు.

English summary
Sarojam Pillai in her letter written to the Chief Minister describes her son, Dileep, as an innocent man, who will never commit such a crime. The Chief Minister’s office, which confirmed receiving the letter from Sarojam, has forwarded it to Kerala police chief Loknath Behera.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X