Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత్ లో భయంకరమైన వాతావరణ ప్రమాదం: డేంజర్ జోన్ లో 9 రాష్ట్రాలు!!

2050 సంవత్సరం నాటికి భయంకరమైన వాతావరణ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న 50 ప్రాంతాలలో అత్యధిక భాగం చైనా కాగా, యూఎస్ మరియు భారతదేశంలో కూడా అటువంటి వాతావరణ ప్రమాదాన్ని ఎదుర్కొనే ప్రాంతాలు ఉన్నాయని తాజాగా

2050 సంవత్సరం నాటికి భయంకరమైన వాతావరణ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న 50 ప్రాంతాలలో అత్యధిక భాగం చైనా కాగా, యూఎస్ మరియు భారతదేశంలో కూడా అటువంటి వాతావరణ ప్రమాదాన్ని ఎదుర్కొనే ప్రాంతాలు ఉన్నాయని తాజాగా ఒక అధ్యయనం తేల్చింది.

వాతావరణ ప్రమాదంలో భారత్ లోని 9 రాష్ట్రాలు

వాతావరణ ప్రమాదంలో భారత్ లోని 9 రాష్ట్రాలు

క్రాస్ డిపెండెన్సీ ఇనిషియేటివ్ సోమవారం విడుదల చేసిన ర్యాంకింగ్ ప్రకారం భారతదేశంలో పంజాబ్, బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, కేరళ మరియు అస్సాం రాష్ట్రాలు అత్యంత హానికరమైన వాతావరణ ప్రమాదాన్ని కలిగి ఉన్నాయని డేటా వెల్లడించింది. భారతదేశ వాణిజ్య రాజధాని అయిన ముంబైలో కూడా తీవ్రమైన వాతావరణ ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ఈ ర్యాంకింగ్ లో తేలింది. 50 హై రిస్క్ ఉన్న రాష్ట్రాలలో భారతదేశంలో తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయని ఇది అప్రమత్తం అవ్వాల్సిన సమయం అని పేర్కొంది.

హై రిస్క్ ఉన్న ప్రాంతాలలో ఈ ఉపద్రవాలకు ఛాన్స్

హై రిస్క్ ఉన్న ప్రాంతాలలో ఈ ఉపద్రవాలకు ఛాన్స్


ఇక అత్యంత భయంకరమైన వాతావరణ ప్రమాదాన్ని కలిగి ఉన్న ప్రాంతాలలో చైనా 26 రాష్ట్రాలను, యూఎస్ ఐదు రాష్ట్రాలను కలిగి ఉందని జాబితా వెల్లడించింది.
ఎటువంటి వాతావరణ ప్రమాదాలను హైరిస్కు ఉన్న ప్రాంతాలు కలిగి ఉన్నాయి అంటే నది మరియు ఉపరితల వరదలు వచ్చే అవకాశాలను, తీర ప్రాంత వరదలు వచ్చే అవకాశాలను, విపరీతమైన వేడి, మంటలకు అడవి తగలబడిపోవడం, కరువు, భూకంపాలు, విపరీతమైన వడగాలులు, చలికి గడ్డ కట్టడం వంటి అనేక వాతావరణ సంబంధమైన రిస్కు వచ్చే అవకాశం ఉందని క్రాస్ డిపెండెన్సీ ఇనిషియేటివ్ వెల్లడించింది.

ఎనిమిది వాతావరణ మార్పులతో మౌలిక, ఆర్ధిక సదుపాయాలకు ప్రమాదం

ఎనిమిది వాతావరణ మార్పులతో మౌలిక, ఆర్ధిక సదుపాయాలకు ప్రమాదం


స్థూల దేశీయ వాతావరణ ప్రమాద ర్యాంకింగ్ మొత్తం ఎనిమిది వాతావరణ మార్పుల ప్రమాదాల నుండి అక్కడ మౌలిక సదుపాయాలకు, ఆర్ధిక వనరులకు భౌతిక ప్రమాదాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ ర్యాంకింగ్లో చైనాలో ఉన్న రాష్ట్రాలు పెద్ద సంఖ్యలో ఉండగా, యూఎస్లో కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా రాష్ట్రాలు ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇక టాప్ 50 లో ఉన్న ఇతర దేశాలను చూసినట్లయితే బ్రెజిల్, పాకిస్తాన్ మరియు ఇండోనేషియాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

ర్యాంకింగ్ డేటా పెట్టుబడిదారులకు చాలా ముఖ్యమైనది

ర్యాంకింగ్ డేటా పెట్టుబడిదారులకు చాలా ముఖ్యమైనది


ఈ ర్యాంకింగ్ డేటా పెట్టుబడిదారులకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వాతావరణ మార్పులతో ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాలలో పెట్టుబడులు పెడితే అక్కడ నష్టం వాటిల్ల అవకాశం ఉంది కాబట్టి వారు ఈ డేటాను చాలా ముఖ్యమైనదిగా భావిస్తున్నారు. బడా పరిశ్రమలు పెట్టడానికి, ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించడానికి హై రిస్క్ లో ఉన్న ప్రాంతాలలో పెట్టడం మంచిది కాదని ఆలోచన చేసే అవకాశం లేకపోలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+