దారుణం: భర్త ఎదుటే భార్యను గ్యాంగ్‌రేప్ చేశారు
చందౌలి: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దారుణాలు ఆగడం లేదు. తాజాగా ఓ వికలాంగ మహిళపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన సహబ్గంజ్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సహబ్గంజ్ ప్రాంతంలో జరిగిన దసరా ఉత్సవాల్లో పాల్గొని సోమవారం రాత్రి బాధిత మహిళ, తన భర్తతో కలిసి తమ నివాసానికి బయల్దేరారు. వారిని వెంబడించిన ఇద్దరు యువకులు భర్తపై దాడి చేసి బంధించారు.

ఆ తర్వాత ఆ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే అత్యాచారానికి పాల్పడింది బాధితురాలి భర్త స్నేహితులేనని పోలీసులు చెప్పారు.
బాధితురాలు, ఆమె భర్త నిందితులపై మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications