వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2023లో కల్లోలాలు తప్పవా? పెరుగుతున్న సముద్ర నీటిమట్టాలు.. ప్రపంచం ముందు పెనుసవాల్!!

|
Google Oneindia TeluguNews

గ్లోబల్ వార్మింగ్... ప్రపంచాన్ని ఇప్పుడు భయపెడుతోంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రమాదం అంచున ప్రపంచం చేరింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఊహించని ప్రకృతి విపత్తులు చోటు చేసుకుని కల్లోలం సృష్టించి, మానవ మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఇదే సమయంలో సముద్ర మట్టాలలోను అనూహ్యమైన పెరుగుదల ప్రజలను ఇప్పుడు బెంబేలెత్తిస్తోంది.

ప్రమాదకరంగా పెరుగుతున్న సముద్ర మట్టాలు

ప్రమాదకరంగా పెరుగుతున్న సముద్ర మట్టాలు


ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని సముద్రాల తీరప్రాంతాలలో సముద్ర మట్టాల పెరుగుదల కనిపిస్తుంది. ఇది ప్రమాదకర పరిణామమని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా మధ్యధరా సముద్ర ప్రాంతంలో సముద్ర మట్టాలు మరీ ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న వైనం అందరినీ కలవరపెడుతోంది. ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కార్చిచ్చులు, సునామీలు, వరదలు, చలి, మంచు తుఫానులు వణికిస్తున్నాయి.

2023లోనూ కల్లోలాలకు ఛాన్స్..

2023లోనూ కల్లోలాలకు ఛాన్స్..


ఇక 2023లో కూడా ఇటువంటి కల్లోలాలు తప్పేలా లేవని పర్యావరణ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల గత 30 సంవత్సరాలలో ప్రపంచ వ్యాప్తంగా సముద్రాల నీటిమట్టాలు ఏ విధంగా మారాయి అన్నదానిపై నాసా విడుదల చేసిన డేటా ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. ప్రతి పది సంవత్సరాలకు వేగంగా మారుతున్న పరిణామాలు భవిష్యత్తులో పరిస్థితులను ఊహకందని విధంగా తయారు చేస్తున్నాయి. పెరుగుతున్న సముద్ర మట్టాల కారణంగా భూమికి ప్రమాదం పొంచి ఉంది. అయితే సముద్ర నీటి మట్టాలు పెరగడం మానవ తప్పిదం అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్ర మట్టాల పెరుగుదల

గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్ర మట్టాల పెరుగుదల

గ్లోబల్ వార్మింగ్ కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది అని, మంచు కొండలు కరిగి నీరుగా మారి సముద్రంలోకి చేరుతుందని, దీంతో సముద్ర మట్టాలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. సముద్ర మట్టాలు పెరగడం కారణంగా భూమి తగ్గిపోతుందని, దీని వల్ల పర్యావరణ కల్లోలాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ఇక సముద్ర నీటి మట్టం పెరగడానికి ముఖ్య కారణం శీతోష్ణస్థితి మార్పులు.

ప్రమాదంలో మానవ మనుగడ.. ప్రపంచ దేశాల ముందు పెను సవాల్

ప్రమాదంలో మానవ మనుగడ.. ప్రపంచ దేశాల ముందు పెను సవాల్

ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదల వలన ధ్రువ అక్షంక్షాల వద్ద ఉన్న మంచు కరిగిపోయి సముద్ర నీటి మట్టం పెరగడానికి కారణం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా, ప్రపంచవ్యాప్తంగా సముద్ర నీటి మట్టం పెరుగుదల అన్నది అనుకున్న దానికన్నా వేగంగా ఉండడం వలన మానవ మనుగడ ప్రమాదంలో పడిందని చెప్పవచ్చు. ఎన్ని సార్లు ప్రపంచ దేశాలు గ్లోబల్ వార్మింగ్ తగ్గించడానికి రకరకాలైన ఆలోచనలు మరియు ప్రణాళికలు సిద్ధం చేసినా అవి అనుకున్న స్థాయి ఫలాలు సాధించలేకపోయాయి. ప్రస్తుత పరిస్థితులలో ప్రపంచ దేశాల ముందు పెను సవాల్ ఉంది. మరి ఇప్పుడైనా గ్లోబల్ వార్మింగ్ తగ్గించడానికి ప్రపంచ దేశాలు ఏం చేస్తాయి? ఏ మేరకు పర్యావరణాన్ని కాపాడడంలో ముందు కృషి జరుగుతుంది? అనేది తెలియాల్సి ఉంది.

ఏపీ ప్రత్యేక హోదా, పోలవరంపై మంత్రి మల్లారెడ్డి సంచలనం; పోటీపైనా మల్లారెడ్డి వ్యాఖ్యల కలకలం!!ఏపీ ప్రత్యేక హోదా, పోలవరంపై మంత్రి మల్లారెడ్డి సంచలనం; పోటీపైనా మల్లారెడ్డి వ్యాఖ్యల కలకలం!!

English summary
Disasters chance in 2023 with the global warming. The world faces a big challenge with rising sea levels.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X