వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిన్నమ్మ‘శశికళ ఫ్యామిలీ’లో చిచ్చు: రగిలిపోతున్నారు, మొదటికే మోసం !

అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ ఫ్యామిలో చిచ్చురేగింది. బెంగళూరు సెంట్రల్ జైల్లో ఉన్న శశికళను లెక్క చెయ్యకుండా ఆమె అక్క కుమారుడు టీటీవీ. దినకరన్ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడంతో మ

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/చెన్నై: అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ ఫ్యామిలో చిచ్చురేగింది. బెంగళూరు సెంట్రల్ జైల్లో ఉన్న శశికళను లెక్క చెయ్యకుండా ఆమె అక్క కుమారుడు టీటీవీ. దినకరన్ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడంతో మొదటికే మోసం వచ్చింది.

ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో శశికళ వర్గంలోని అన్నాడీఎంకే పార్టీ నుంచి టీటీవీ. దినకరన్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దినకరన్ పోటీ చెయ్యడం శశికళకు ఏమాత్రం ఇష్టం లేదని గతంలోనే వెలుగు చూసింది.

జైల్లో నుంచి చక్రం తిప్పాలని చూస్తే

జైల్లో నుంచి చక్రం తిప్పాలని చూస్తే

బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళను కలవడానికి వెళ్లిన ఆమె అనుచరుల ముందే శశికళ దినకరన్ పోటీ విషయంపై అసహనం వ్యక్తం చేశారు. అయినా దినకరన్ మాత్రం శశికళ గురించి పట్టించుకోకుండా ఆయనే సొంత నిర్ణయం తీసుకున్నాడు

నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా

నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా

టీటీవీ దినకరన్ ఆర్ కే నగర్ లో పోటీ చేసే విషయంలో శశికళ చిన్న తమ్ముడు వీ. దివాకరన్ సైతం బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జయలలిత ప్రాతినిథ్యం వహించిన ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో దినరన్ పోటీ చెయ్యడం ఏమిటని, జయలలితకు, దినకరన్ కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని దివాకరన్ తన కుటుంబ సభ్యుల ముందు మండిపడుతున్నారు.

మండిపడుతున్న శశికళ భర్త నటరాజన్

మండిపడుతున్న శశికళ భర్త నటరాజన్

ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో టీటీవీ. దినకరన్ ఏలా పోటీ చేస్తారని, ఆయన సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారం ఎవరు ఇచ్చారని శశికళ భర్త నటరాజన్ తన సన్నిహితుల దగ్గర మండిపడుతున్నారు. వారం క్రితం ఇదే విషయంలో టీటీవీ. దినకరన్, నటరాజన్ ల మద్య వాగ్వివాదం జరిగిందని శశికళ వర్గంలోని అన్నాడీఎంకే పార్టీ నాయకులు అంటున్నారు

ఆ మంత్రి అండతోనే రెచ్చిపోతున్న దినకరన్

ఆ మంత్రి అండతోనే రెచ్చిపోతున్న దినకరన్

మంత్రి కామరాజ్ సహకారంతోనే దినకరన్ ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని శశికళకు ఆమె వర్గీయులు సమాచారం ఇచ్చారు. ఎవ్వరికీ తెలియకుండా మంత్రి కామరాజ్, దినకరన్ సమావేశం అయ్యి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని శశికళ చెవిలో పడిందని చిన్నమ్మ వర్గీయులు అంటున్నారు

చిన్నమ్మ ప్లానే ఇదే

చిన్నమ్మ ప్లానే ఇదే

ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో శశికళ తాను సూచించిన వ్యక్తిని బరిలో నిలపాలని తన వర్గీయులకు సూచించారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీఆర్ సోదరుడి కుమార్తె సుధా విజయన్ ను ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయించాలని, ఆ విదంగా ఎంజీఆర్, జయలలిత అభిమానుల ఓట్లు తమకే వస్తాయని శశికళ అనుకున్నారు.

సీఎం పళనిసామి సీటుకు ఎసరు

సీఎం పళనిసామి సీటుకు ఎసరు

ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో టీటీవీ. దినకరన్ గెలిస్తే తన సీఎం సీటుకు ఎసరు వస్తుందని, కనీసం తనతో ఒక్క మాటకూడా సంప్రదించకుండా దినకరన్ నిర్ణయం తీసుకున్నారని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి అసహనం వ్యక్తం చేశారని తెలిసింది.

దినకరన్ కు వ్యతిరేకంగా

దినకరన్ కు వ్యతిరేకంగా

ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వంలోని పెద్దలు దినకరన్ కు సహకరిస్తే అన్నో ఇన్నో ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఓ పక్క జయలలిత మేనకోడలు దీపా, మరో పక్క పన్నీర్ సెల్వం వర్గంలోని సీనియర్ నాయకుడు మధుసూదనన్ ఆర్ కే నగర్ ఉప ఎన్నికల బరిలో ఉన్నారు. శశికళ, సీఎం ఎడప్పాడి పళనిసామికి తెలీకుండా దినకరన్ సొంత నిర్ణయం తీసుకుని రివర్స్ గేర్ వెయ్యడంతో మొదటికే మోసం వచ్చింది.

English summary
V. Diwakaran upset over T.T.V.Dinakaran's decision to contest in the R.K.Nagar by election, says sources.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X