ఇదేందయ్యా ఇది.. "దీపావళి"ని ఇలా కూడా సెలబ్రేట్ చేస్తారా !
దీపావళి.. చీకటిని తొలగించి వెలుగును నింపే ఈ పండుగను దేశమంతా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. దీపాలు వెలిగించి, ఇళ్లు అలంకరించి, పిండి వంటలు తయారు చేసి, కొత్త దుస్తులు ధరించి ఆనందంగా జరుపుకుంటారు. అలానే ఆరోజు లక్ష్మీదేవిని పూజించి సంపద, శ్రేయస్సు, ఆనందం కలిగించమని కోరుకుంటారు. పిల్లలు టపాసులు కాల్చి ఆనందిస్తే.. పెద్దలు బంధుమిత్రులను కలుసుకుని స్వీట్లు పంచుకుంటారు. ఇప్పటికే ఊరూరా, పట్టణాల్లో టపాసుల మోతలు మొదలై పండుగ వాతావరణం నెలకొంది.
కాగా ఉత్తర భారతదేశంలో ఈ పండుగను రాముడి అయోధ్య తిరుగుముఖం సందర్భంగా.. దక్షిణ భారతదేశంలో కృష్ణుడు నరకాసురుడిని సంహరించిన రోజుగా వేడుకలు నిర్వహిస్తారు. అలానే పశ్చిమ భారతదేశంలో లక్ష్మీ పూజ, వ్యాపార సంవత్సరారంభంగా జరుపుకుంటారు. కానీ కారణం ఏదైనా సెలబ్రేషన్ విధానంలో మాత్రం మార్పు ఉండదు. అయితే కర్ణాటక-తమిళనాడు సరిహద్దులోని గుమతాపుర గ్రామంలో మాత్రం వేరే రకంగా పండుగను జరుపుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

గోరెహబ్బ..
దీపావళి తర్వాతి రోజు జరిగే ఈ ప్రత్యేక పండుగ పేరు 'గోరెహబ్బ'. ఇది శతాబ్దాల నాటి సంప్రదాయంగా వారు కొనసాగిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో దీపాల వెలుగులు, పటాసులు ప్రధానంగా ఉంటే.. ఇక్కడ మాత్రం ప్రజలు ఆవు పేడను ఒకరిపై ఒకరు విసురుకుంటూ ఆనందంగా పండుగ జరుపుకుంటారు. పురుషులు ఆవు పేడను ఒకరిపై ఒకరు విసురుకుంటారు. కొందరు మహిళలు తమ శరీరంపై ఆవు పేడను రాసుకుంటారు.
కాగా స్థానికుల నమ్మకం ప్రకారం.. ఆవు పేడకు శుద్ధి చేసే గుణాలు, ఔషధ విలువలు కలిగి ఉంటుంది. ఇది శరీరంలోని దుష్ట ప్రభావాలను తొలగించి, ఆరోగ్యాన్ని కాపాడుతుందని వారు విశ్వసిస్తారు. ఈ పండుగను వారు ఒక శుద్ధీకరణ ప్రక్రియగా చూస్తారు. గోరెహబ్బ పండుగ రోజు మధ్యాహ్నం గ్రామస్తులు తమ పశువుల యజమానుల ఇళ్ల నుండి "మందుగుండు సామగ్రి" అని పిలిచే ఆవు పేడను సేకరిస్తారు. ఆ పేడను ట్రాక్టర్లు, ట్రాలీల ద్వారా స్థానిక ఆలయానికి తీసుకువస్తారు. అక్కడ పూజారి పేడపై ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వదిస్తారు. అనంతరం ఆ పేడను బహిరంగ ప్రదేశంలో కుప్పగా పోస్తారు. అప్పుడు పురుషులు ఆ పేడను ఒకరిపై ఒకరు విసురుకుంటూ పండుగలో పాల్గొంటారు.
ఈ పండుగను కేవలం వినోదం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం మరియు అదృష్టానికి ప్రతీకగా కూడా జరుపుకుంటారు. ఆవు పేడతో కాయానికి రక్షణ లభిస్తుందని, కొన్ని చర్మ వ్యాధులు మరియు ఇన్‌ఫెక్షన్లను నివారించగలదని వారు విశ్వసిస్తారు. ఇది మంచి పంటలు, పశుసంపద అభివృద్ధి, కుటుంబ శ్రేయస్సు కోసం జరుపుకునే ఆచారంగా భావిస్తారు.
ఇక ఈ పండుగ వెనుక రెండు ప్రధాన పురాణ కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అందులో మొదటిది - గుమతాపుర గ్రామానికి ప్రాధాన్యమైన దేవత బీరేశ్వర స్వామి ఆవు పేడ నుంచే అవతరించారని నమ్మకం. ఈ కారణంగానే ప్రజలు ఆవు పేడను పవిత్రంగా భావించి పూజిస్తారు. రెండవ కథ ప్రకారం - ఒకసారి గ్రామంలో ఆవు పేడ కుప్పలో శివలింగం కనుగొనబడింది. దాంతో గ్రామస్థులు దానిని దైవ సూచనగా భావించి, ఈ పండుగను ప్రతి సంవత్సరం జరపడం ప్రారంభించారని చెబుతారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications