మోడీ ఎఫెక్ట్: మంత్రి ఇంటిలో ఐటీ దాడులకు బ్రేక్: గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో డీకే భేటీ !

రాజ్యసభ ఎన్నిక సందర్బంగా ఆపరేషన్ కమల (బీజేపీ)కు భయపడిన గుజరాత్ కాంగ్రెస్ శాసన సభ్యులు బెంగళూరు నగర శివార్లలోని ఈగల్టన్ గాల్ఫ్ రిసార్ట్ లో బస చేసిన విషయం తెలిసిందే.

బెంగళూరు: రాజ్యసభ ఎన్నిక సందర్బంగా ఆపరేషన్ కమల (బీజేపీ)కు భయపడిన గుజరాత్ కాంగ్రెస్ శాసన సభ్యులు బెంగళూరు నగర శివార్లలోని ఈగల్టన్ గాల్ఫ్ రిసార్ట్ లో బస చేసిన విషయం తెలిసిందే. శనివారం గుజరాత్ శాసన సభ్యులు బెంగళూరులోని కర్ణాటక రాజ్ భవన్ చేరుకున్నారు.

ఆదాయపన్ను శాఖ దాడులో నాలుగు రోజుల పాటు ఉక్కిరిబిక్కిరి అయిన కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ ఇప్పుడు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. శనివారం మద్యాహ్నం ఆదాయపన్ను శాఖ అధికారులు డీకే. శివకుమార్ ఇంటిలో సోదాలు పూర్తి చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.

DK Shivakumar meets Gujarat MLAs at Karnataka Raj Bhavan

మంత్రి డీకే. శివకుమార్ సదాశివనగర్ నుంచి రాజ్ భవన్ చేరుకున్నారు. తరువాత అక్కడ ఉన్న గుజరాత్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులతో మంత్రి డీకే. శివకుమార్ మాట్లాడారు. వారితో కలిసి రాజ్ భవన్ బయటకు వచ్చి మీడియా ముందు ఫోటోలకు ఫోజు ఇచ్చారు.

నాలుగు రోజుల తరువాత మంత్రి డీకే. శివకుమార్ నవ్వుతూ మీడియాతో మాట్లాడాను. నన్ను నమ్మి గుజరాత్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు ఇక్కడికి వచ్చారని, వారికి కావలసిన సదుపాయుల చూడటం నా బాధ్యత అని మంత్రి డీకే శివకుమార్ మీడియాకు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+