దక్షిణాది రాష్ట్రాలతో ప్రత్యేక దేశం, తమ్ముడి మాటకు డీకే ఏం చెప్పారంటే, ప్రతిపక్షాలతో !
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పేరు రాజకీయాల్లో కొత్తగా పరిచయం చెయ్యనవసరం లేదు. డీకే శివకుమార్ ముద్దుల తమ్ముడు, బెంగళూరు గ్రామీణ ఎంపీ డీకే సురేష్ కూడా కర్ణాటకతో పాటు కొన్ని రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులకు తెలుసు. అయితే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన గురువారం రోజు డీకే సురేష్ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు. దేశాన్ని రెండు ముక్కలుగా విభజించాలని సంచలన వ్యాఖ్యలు చేసిన డీకే సురేష్ జాతీయ మీడియాలో కూడా హాట్ టాపిక్ అయ్యారు.
దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం విడిపోతే మాకు లాభం అంటూ వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ ఒక్కసారిగా కలకలం రేపారు. ప్రత్యేక దేశం కోసం డిమాండ్ చేసిన డీకే సురేష్ ప్రకటన సంచలనం సృష్టించింది. కేంద్ర బడ్జెట్‌పై డీకే సురేష్ మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ఉత్తర భారతానికి మాత్రమే ఎక్కువ గ్రాంట్లు ఇస్తున్నారని, ఇలా దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని బహిరంగంగా ఆరోపించారు.

దక్షిణ భారతదేశం ప్రత్యేక దేశం అవుతుందని కూడా డీకే సురేష్ జోస్యం చెప్పడంతో రాజకీయ నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీని గురించి కర్ణాటక ఉప ముఖ్య మంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ స్పందించారు. తన తమ్ముడు డీకే సురేష్ చేసి వ్యాఖ్యల గురించి డీకే శివకుమార్ ఎలా స్పందిస్తారు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే డీకే శివకుమార్ మాట్లాడిన మాటలతో డీకే సురేష్ తో పాటు ఆయన అనుచరులు షాక్ అయ్యారు.

ప్రత్యేక దేశం గురించి సురేష్ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అయ్యింది. మనది అఖండ భారతదేశం, ప్రత్యేక దేశం కావాలని తన సోదరుడు డీకే సురేష్ చేస్తున్న డిమాండ్‌ను నేను అంగీకరించనని, దేశం విడిపోవడానికి తాము అంగీకరించమని, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని డీకే శివకుమార్ అన్నారు. అఖండ భారత్ ఒక్కటే కాబట్టి ఒకే భారతదేశం ఉండాలి, డీకే సురేష్ చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని డీకే శివకుమార్ అన్నారు.
అయితే డీకే సురేష్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు మండిపడుతున్న సమయంలో డీకే శివకుమార్ సర్ది చెప్పడానికి ప్రయత్నించారని తెలిసింది. ఢిల్లీలో గురువారం కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడంపై స్పందించిన పార్లమెంట్ సభ్యుడు డీకే సురేష్ ఈరోజు బడ్జెట్ లో కొత్తదనం ఏమీలేదని, దక్షిణ భారత రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని, ఇలాగే మాకు అన్యాయం జరిగితే ప్రత్యేక దేశం గళం వినిపించాలని అన్నారు.

కేంద్ర ప్రభుత్వంపై డీకే సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టించింది. కర్ణాటకలోని ప్రతిపక్ష పార్టీల నేతలు డీకే సురేష్ మీద రాజకీయ అస్త్రాలు సంధిస్తున్నారు. ఈ తరుణంలో డీకే సురేష్ సోదరుడు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి కూడా స్పందిస్తూ మనది అఖండ భారతదేశం, మన దేశం ఎప్పటికి విడిపోదు అంటూ తమ్ముడు చేసిన డ్యామేజ్ కవర్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని బీజేపీ నాయకులు మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications