ఐటీ హబ్ లో వాటర్ మాఫియా, బంగారు కంటే వాటర్ రేట్లు ఎక్కువ, సీజ్ చెయ్యాలి, ఎమ్మెల్యేలు!
ఐటీ హబ్ బెంగుళూరులో తాగునీటితో పాటు నిత్యం వాడుకునే నీటి కొరత ఎక్కువ కావడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని పెట్టుబడిగా పెట్టుకున్న ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల యజమానులు నీటి ధరలు విచ్చలవిడిగా పెంచి ప్రజల నుండి భారీ మొత్తంలో డబ్బులు రాబడుతున్నారు. ఈ విషయంలో కర్ణాటక ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నది అని ప్రతిపక్ష నేతలు ప్రశ్నించారు.
ఈ విషయంపై కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందిస్తూ వేసవిలో వాటర్ ట్యాంకర్లు, బోర్‌వెల్‌లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ట్యాంకర్లకు ధర నిర్ణయించాలన్న బీజేపీ ఎమ్మెల్యేల సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. వేసవి కాలంలో ప్రజలకు బోర్‌వెల్ నుండి నీటిని సరఫరా చేయడానికి బీడబ్ల్యూఎస్ఎస్ బీ ఏర్పాట్లు చేస్తుంది. అయితే ప్రైవేట్ బోర్‌వెల్‌లపై బీడబ్ల్యూఎస్ఎస్ బీ కి ఎలాంటి నియంత్రణ లేదు.

ప్రయివేటు వ్యక్తులు స్వయంగా వాటర్ ట్యాంకర్లలో నీటిని తీసుకొచ్చి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి ఆ నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రైవేట్ బోర్‌వెల్‌లపై బీడబ్ల్యూఎస్ఎస్ బీకి నియంత్రణ ఉండటంలేదు. ప్రస్తుతం బెంగళూరులో నీరు పెద్ద వ్యాపారం అయ్యిందిని బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ విషయంపై బీజేపీ నాయకుల ఆరోపణలను డీసీఎం డీకే శివకుమార్ ఓపికగా విన్నారు.
ఈ సందర్భంలో బీజేపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ నీటి డిమాండ్ పెరగడంతో ప్రైవేట్ ట్యాంకర్ల యాజమాన్యం నీటి ట్యాంకర్ల రేటు పెంచుతున్నాయని, కాబట్టి ప్రభుత్వం నీటి ట్యాంకర్‌కు రూ 750 నుంచి రూ 800గా ధర నిర్ణయించాలని, అప్పుడే ప్రజలకు ఉపయోగపడుతుందని సూచించారు. బెంగళూరులో నీటి ట్యాంకర్ల దందా విషయాన్ని డీసీఎం డీకే శివకుమార్ సీరియస్‌గా తీసుకున్నారు. నాకు మంచి సలహా ఇచ్చారని, దీనిపై త్వరలో సమావేశం ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకుంటామని డీకే శివకుమార్ హామీ ఇచ్చారు.
అఖిలపక్ష సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాలు సేకరించి తగిన నిర్ణయం తీసుకుంటామని డీకే శివకుమార్ అన్నారు. భూగర్భ జలాలు ప్రభుత్వానికి చెందుతాయని, దానిపై మాకు నియంత్రణ ఉందని, త్వరలో తగిన చర్యలు తీసుకుంటామని డీకే శివకుమార్ బీజేపీ ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రతిపక్షనేత ఆర్. అశోక్ కావేరీ జలాలు 30 శాతం తగ్గాయన్నారు. బోరు బావుల్లో నీరు లేకపోవడంతో కావేరి నీటిని ప్రజలు కోరుకుంటున్నారని ఆర్ అశోక్ గుర్తు చేశారు.

మరో నాలుగు నెలల వేసవి కాలం ఎదురుకానుందని, ప్రజలు ఆ నాలుగు నెలలు నీటి కోసం ఆరాటపడవలసి వస్తోందని, అయితే నాలుగు నెలల పాటు నీరు సరఫరా చెయ్యడం కష్టమని ప్రతిపక్ష నాయకుడు ఆర్, అశోక్ అన్నారు. రెవెన్యూ చట్టం ప్రకారం ప్రైవేటు బోర్‌వెల్‌లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అందరికీ నీటిని పంపిణీ చేయవచ్చు. జిల్లా కలెక్టర్ ద్వారా ఇలా చేయడానికి అధికారం ఉంది.
నీటి ట్యాంకర్‌లన్నింటినీ ఒకే నెట్‌వర్క్‌లోకి తీసుకురావడానికి పౌరసరఫరాల సంస్థలో ఉన్న చట్టాన్ని ఉపయోగించి ప్రభుత్వం, ప్రైవేట్ ట్యాంకర్ వ్యాపారులతో కలిసి ఉమ్మడి సంస్థను రూపొందించాలని ఆర్ అశోక్ సూచించారు. దీనిపై స్పందించిన డీకే శివకుమార్ బీజేపీ నాయకుల సూచనలు, సలహాలను అంగీకరించారు. బెంగళూరులో వాటర్ మాఫియాను నియంత్రించాలన్న బీజేపీ ఎమ్మెల్యేల డిమాండ్ తో డీకే శివకుమార్ ఏకీభవించారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications