వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంగ్లా కొనుగోలు కోసం 435 కోట్లు ఖర్చు, ఢిల్లీలో అత్యధిక ధరగా రికార్డు

డిఎల్ఎఫ్ చైర్మెన్ కెపి సింగ్ కూతురు రేణుక తల్వార్ డిల్లీలోని పృథ్వీరాజ్ రోడ్డులో 435 కోట్లను ఖర్చుచేసి ఒ బంగ్లాను కొనుగోలు చేశారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ :ఓ భవనాన్ని కొనుగోలు చేసేందుకు ఓ యువతి 435 కోట్లను ఖర్చు పెట్టింది.కోటి రూపాయాలు పెట్టి ఇల్లు లేదా భవనాన్ని కొనుగోలు చేస్తే ఆశ్చర్యంగా చూస్తాం. కాని, 435 కోట్లను ఖర్చు చేసి డిఎల్ఎప్ యజమాని కూతురు 435 కోట్లను ఖర్చు చేసి ఓ పెద్ద బంగ్లాను కొనుగోలు చేసింది. డిల్లీలోని పృథ్వీరాజ్ రోడ్డులో ఉన్న ఈ బంగ్లాను ఆమె కొనుగోలు చేసింది.

ప్రముఖ వ్యాపార దిగ్గజం డిఎల్ ఎప్ సంస్థ చైర్మెన్ కెపీ సింగ్ కూతురు రేణుక తల్వార్ 435 కోట్లను ఖర్చుచేసి డిల్లీలోని పృథ్వీరాజ్ రోడ్డులోని బంగ్లాను కొనుగోలు చేశారు. టిడిఐ ఇన్ ఫ్రా కార్పోరేషన్ డెవలపర్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కమల్ తనేజా ఆమెకు ఈ బంగ్లాను విక్రయించారు.

dlf chairman daughter renuka buys a bunglow for 435 crore

ఈ బంగ్లా సుమారు 4925 చదరపు మీటర్లు ఉంటుంది. ఒక్కో చదరపు మీటకు సుమారు 8.8 లక్షల రూపాయాలకు ఆమె కొనుగోలు చేసింది. ఈ ప్రాంతంలో ఇప్పటివరకు అత్యధికంగా డబ్బులు చెల్లించి విక్రయించిన బంగ్లా ఇదేనని రియల్ ఏస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు.

గతంలో ఇదే ప్రాంతంలో 173 కోట్లను ఖర్చు చేసి ఒకరు ఓ బంగ్లాను కొనుగోలు చేశారు. ఇదే ఇప్పటివరకు అత్యధిక మొత్తంగా రికార్డుల్లో ఉంది. డిఎల్ ఎప్ లోనే నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తోన్న తల్వార్ ను రేణుక వివాహం చేసుకొన్నారు. ఇప్పటికే ఆమె తండ్రి కెపి సింగ్ కు డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం రోడ్డులో కూడ రెండు ఖరీదైన బంగ్లాలు ఉన్నాయి.

English summary
renuka talwar daughter of dlf chairman kp singh has acquired a bunglow on prithviraj road for 435 crore in one of the biggest deals for a property in luteyns delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X