డీఎంకె జాతి విద్రోహక పార్టీ.. దానికన్నా శశికళే బెస్ట్: సుబ్రహ్మణ్యస్వామి
డీఎంకె పార్టీని జాతివిద్రోహక, హింసాత్మక పార్టీగా సుబ్రహ్మణ్యస్వామి అభిప్రాయపడ్డారు. డీఎంకె కంటే జైల్లో ఉన్న శశికళనే బెస్ట్ అని ఆయన వ్యాఖ్యానించారు.
చెన్నై: తమిళ రాజకీయ పోరు సామాన్య ప్రజలకు రాజకీయాలంటేనే ఏహ్య భావం పెంచేలా చేస్తున్నాయి. బహుశా దేశచరిత్రలోనే ఇంత రభసకు దారితీసిన అసెంబ్లీ సమావేశం ఇదేనేమో! మొత్తం మీద రాజ్యాంగ విలువలను ఏమాత్రం లెక్క చేయకుండా డీఎంకె నేతలు అసెంబ్లీలో రెచ్చిపోతున్న పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఈ నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ గా చెప్పుకునే బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి తమిళ రాజకీయాలపై తాజాగా మరోసారి స్పందించారు. డీఎంకె పార్టీని జాతివిద్రోహక, హింసాత్మక పార్టీగా సుబ్రహ్మణ్యస్వామి అభిప్రాయపడ్డారు. డీఎంకె కంటే జైల్లో ఉన్న శశికళనే బెస్ట్ అని ఆయన వ్యాఖ్యానించారు.

కాగా, వాయిదా అనంతరం మధ్యాహ్నాం ఒంటిగంటకు సభ మొదలవగా.. డీఎంకె నేతలు మళ్లీ అదే గందరగోళం సృష్టించారు. దీంతో సభను నడిపించలేని పరిస్థితుల్లో స్పీకర్ మరోసారి 3గం.లకు అసెంబ్లీని వాయిదా వేశారు. ప్రస్తుతం అసెంబ్లీలో విరిగిపోయిన బల్లలు, విరిగిపోయిన మైకులు, చించేయబడ్డ తెల్లకాగితాలు, డీఎంకె నేతల అరుపులతో విధ్వంసక వాతావరణం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications