బీజేపీ గెలిచింది గోమూత్ర రాష్ట్రాల్లోనే ! డీఎంకే ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు..

మూడు హిందీ రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్తాన్ లో బీజేపీ తాజాగా సాధించిన అసెంబ్లీ ఎన్నికల విజయాలపై దేశవ్యాప్తంగా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు వీటిని రిహార్సల్స్ గా పలువురు భావిస్తుండగా.. మరికొందరు వీటిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే క్రమంలో తమిళనాడుకు చెందిన డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ బీజేపీ విజయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవి కాస్తా వైరల్ అవుతున్నాయి.

బీజేపీ బలం హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో మాత్రమే ఉందని, వాటిని మనం గోమూత్ర రాష్ట్రాలుగా పేర్కొంటామని డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ వ్యాఖ్యానించారు. దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, కేరళలో బీజేపీ పరాజయాలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. అయితే డీఎంకే ఎంపీ సెంధిల్ కుమార్ గతంలోనూ హిందీ రాష్ట్రాల్ని గోమూత్ర రాష్ట్రాలుగా అభివర్ణించారు. జాతీయ విద్యావిధానం అమలు విషయంలో గతేడాది ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

DMK MP Senthil Kumar controversial remarks on bjp, says win election in gau mutra states

ఇప్పటికే డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల వివాదం కొనసాగుతోంది. దీనిపై ఇప్పటికే కోర్టుల్లో పలు కేసులు నడుస్తున్నాయి. అలాగే బీజేపీ ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల్ని హిందీ రాష్ట్రాల్లో ప్రచారం కోసం వాడుకుంటోంది. ఈ నేపథ్యంలో డీఎంకే పార్టీకే చెందిన సెంధిల్ కుమార్ బీజేపీ గెలిచిన మూడు హిందీ రాష్ట్రాలను గోమూత్ర రాష్ట్రాలుగా అభివర్ణించడం వివాదాస్పదమవుతోంది. దీనిపై బీజేపీ ఇంకా స్పందించాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+