కాంట్రాక్టు కార్మికురాలిపై డాక్టర్ సహా, ల్యాబ్ టెక్నీషీయన్లు అత్యాచారం

ఆసుపత్రిలో పనిచేసే కాంట్రాక్టు కార్మికురాలిపై ప్రభుత్వ డాక్టర్ తో పాటు, ఇద్దరు ల్యాబ్ టెక్నీషీయన్లు, తోటమాలి అత్యాచారానికి పాల్పడిన ఘటన న్యూఢిల్లీలో చోటుచేసుకొంది. ఈ ఘటనకు పాల్పడిన నిందితుల్లో డాక్టర్

న్యూఢిల్లీ :ఓ ఆసుపత్రిలో పనిచేసే కాంట్రాక్టు కార్మికురాలిపై ప్రభుత్వ డాక్టర్ సహా, ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం బయటకు చెప్పకూడదని నిందితులు ఆమెను బెదిరించారు. ఈ ఘటన ఢిల్లీలోని మోతీబాగ్ ప్రాంతంలో చోటుచేసుకొంది.

దక్షిణ ఢిల్లీలోని మోతీబాగ్ ప్రాంతంలో ప్రభుత్వ డాక్టర్, ఇద్దరు ల్యాబ్ టెక్నీషీయన్లు ఆసుపత్రిలో పనిచేసే కాంట్రాక్టు కార్మికురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆసుపత్రి ఆవరణలోనే ఆమెపై నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడడారు.

doctor and lab technichians raped on contract labour in hospital

ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పి 29 ఏళ్ళ యువతిని ప్రభుత్వ వైద్యుడు అఫ్జల్ ఖాను పరిచయం చేశారు ఇద్దరు ల్యాబ్ టెక్నీషీయన్లు. అయితే కాంట్రాక్టు కార్మికురాలిపై వప్రభుత్వ వైద్యుడు తన ఛాంబర్ లోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకు ఇద్దరు ల్యాబ్ టెక్నీషీయన్లు కూడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

అక్టోబర్ చివరి వారంలో పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఆమెను ఇద్దరు ల్యాబ్ టెక్నీషీయన్లు ఆసుపత్రి పై గదుల్లోకి తీసుకెళ్ళి వరుసగా అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పారు. నవంబర్ మొదటివారంలో ఆసుపత్రిలో పనిచేసే తోటమాలి కూడ తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసుకుల ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు కారణంగా డాక్టర్ కాంట్రాక్టును రద్దు చేశారు.టెక్నీషీయన్ తో పాటు డాక్టర్ ను అరెస్టు చేశారు. మరో టెక్నీషీయన్ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+