Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

డాక్టర్స్ డే : కరోనాపై నిస్వార్ధ దేవదూతల వీరోచిత పోరాటం; ప్రధాని మోడీతో పాటు ప్రముఖుల కితాబు !!

ఈ రోజు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా దేశంలోని రాజకీయ ప్రముఖులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులందరూ వైద్యులు దేశ ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం అందిస్తున్న సేవలను కొనియాడుతున్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా మహమ్మారి పై పోరాటం సాగిస్తున్న వైద్యులను ప్రశంసిస్తున్నారు. గతేడాది కరోనా మహమ్మారి దేశంలో ప్రబలిన నాటినుండి నిరంతరాయంగా సేవలందిస్తున్న వైద్యులకు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ వైద్యులు చేస్తున్న నిరుపమానమైన సేవలను కీర్తిస్తున్నారు.

డాక్టర్ల కృషి ప్రశంసిస్తూ ప్రధాని మోడీ ట్వీట్

డాక్టర్ల కృషి ప్రశంసిస్తూ ప్రధాని మోడీ ట్వీట్


భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ లో డాక్టర్స్ డే సందర్భంగా, వైద్య ప్రపంచంలో భారతదేశం సాధించిన ప్రగతి ప్రశంసనీయం అని అన్నారు. గత వారాంతంలో తన మన్ కి బాత్ రేడియో ప్రసంగంలోని ఒక క్లిప్పింగ్ ని షేర్ చేస్తూ దేశంలో కోవిడ్ -19 మహమ్మారిని ఎదుర్కోవడంలో ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తల కృషిని ఆయన ప్రశంసించారు. వైద్యుల దినోత్సవం రోజున, వైద్యులందరికీ నా శుభాకాంక్షలు. ఔషధ రంగంలో, వైద్యంలో ప్రపంచంలో భారతదేశం సాధించిన పురోగతులు ప్రశంసనీయం , ప్రజలంతా ఆరోగ్యంగా ఉండటానికి అవి ఎంతగానో దోహదపడ్డాయి. అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.

 విధిని సైతం ఎదిరించి ప్రజల ప్రాణాలు కాపాడిన వైద్యులు : రాంనాథ్ కోవింద్

విధిని సైతం ఎదిరించి ప్రజల ప్రాణాలు కాపాడిన వైద్యులు : రాంనాథ్ కోవింద్

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వైద్యుల సేవ విధి పిలుపుకు మించిందని అన్నారు. విధిని సైతం ధిక్కరిస్తూ ఎంతోమంది ప్రాణాలను కాపాడటంలో తమ ప్రాణాలను పణంగా పెట్టిన నిస్వార్థ దేవదూతలకు మేము ఎంతో రుణపడి ఉన్నాము అని ఆయన అన్నారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా డాక్టర్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ కావడం మానవాళికి సేవ చేయాలనే ఒక ప్రతిజ్ఞ. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా, మన ధైర్యవంతులైన వైద్యుల వీరోచిత ప్రయత్నాలకు నమస్కరిస్తున్నాము, అసమానతలతో సంబంధం లేకుండా మానవాళికి సేవ చేయటానికి ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా ప్రజల ప్రాణరక్షణ కోసం ఎంతో కష్టపడుతున్నారు అంటూ ట్వీట్ చేశారు.

ప్రజల ప్రాణ రక్షణకు 24 గంటలూ పని చేసిన వైద్యులు : వెంకయ్య నాయుడు

ప్రజల ప్రాణ రక్షణకు 24 గంటలూ పని చేసిన వైద్యులు : వెంకయ్య నాయుడు

భారత వైస్ ప్రెసిడెంట్ ఎం. వెంకయ్య నాయుడు, కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ ఈ రోజు వైద్యుల దినోత్సవం సందర్భంగా తమ శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, మహారాష్ట్రకు చెందిన అజిత్ పవార్లతో సహా ఎంతో మంది నాయకులు వైద్యుల దినోత్సవం నాడు వైద్యులను కొనియాడారు. వారి సేవలను ప్రశంసించారు.భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ వైద్యుల దినోత్సవం సందర్భంగా, వైద్య సహోదర సభ్యులందరికీ నిస్వార్థ సేవలను అందించినందుకు, ప్రాణాలను పణంగా పెట్టి ఇతరుల ప్రాణాలను కాపాడటానికి 24 గంటలు పని చేసినందుకు నేను వందనం చేస్తున్నాను అంటూ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కారణంగా వైద్యులు మరియు వారి కుటుంబాలపై తీవ్ర ఒత్తిడి పెరిగిందని, మనమందరం కోవిడ్ తగిన ప్రవర్తనను అనుసరించి, వైద్యులపై ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేద్దామని కరోనా రాకుండానే జాగ్రత్తలు తీసుకుందామని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.

 కరోనాపై పోరాటం వైద్యుల నిస్వార్థత ను ప్రతిబింబించింది : డాక్టర్ హర్ష వర్ధన్

కరోనాపై పోరాటం వైద్యుల నిస్వార్థత ను ప్రతిబింబించింది : డాక్టర్ హర్ష వర్ధన్

ఇదిలా ఉంటే కరోనా మహమ్మారి దేవుళ్ళలా వైద్యులు చేసిన సేవలలో వారి నిస్వార్ధతను ప్రతిబింబించింది అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ స్పష్టం చేశారు. జాతీయ వైద్యుల దినోత్సవం నాడు మానవ జాతిని రక్షిస్తున్న, అలసిపోకుండా సేవలు చేస్తున్న వైద్యులకు సెల్యూట్ చేస్తున్నాను అంటూ పేర్కొన్నారు. అంతేకాదు మానవ జాతిని కాపాడడం కోసం, దేశాన్ని రక్షించడం కోసం నిరంతరాయంగా పని చేసి, ప్రాణాలు కోల్పోయిన వైద్యులందరికీ నివాళులర్పిస్తున్నానంటూ పేర్కొన్నారు.

మీ ఋణం తీర్చుకోలేం రాహుల్ ట్వీట్ .. సెల్యూట్ డాక్టర్స్ అంటున్న దేశం

మీ ఋణం తీర్చుకోలేం రాహుల్ ట్వీట్ .. సెల్యూట్ డాక్టర్స్ అంటున్న దేశం


ప్రజల ప్రాణాలు రక్షించడానికి డాక్టర్లు సేవలు చేస్తున్న ప్రతి నిమిషానికి, వారి విలువైన సమయానికి ఎప్పటికీ రుణపడి ఉంటాము అంటూ, డాక్టర్లకు ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ. ఇలా జాతీయ వైద్యుల దినోత్సవం నాడు ఎందరో రాజకీయ ప్రముఖులు, ప్రస్తుతం ఆరోగ్య సంక్షోభం ఎదుర్కొంటున్న దేశాన్ని రక్షించడం కోసం కష్టపడుతున్న వైద్యులకు కృతజ్ఞతలు చెప్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+