వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్కడ వీధి కుక్కలకు రాజభోగం.. కడుపునిండా భోజనం.. ఆశ్చర్యం కలిగించే శునకాల ఆశ్రమం విశేషాలివే!!

|
Google Oneindia TeluguNews

మనుషులకే పట్టెడు అన్నం పెట్టి ఆదరించే దిక్కు లేని నేటి సమాజంలో మూగజీవాల కోసం ఆలోచిస్తున్నవారు ఉన్నారంటే ఆశ్చర్యం కలుగక మానదు. మూగ జీవాలైన కుక్కల కోసం ఏకంగా ఒక ఆశ్రమమే నిర్వహిస్తున్నారు అంటే మన కళ్ళు మరింత పెద్దవవుతాయి. ఎక్కడ ఆ ఆశ్రమం .. అసలు ఎందుకు కుక్కలకు వారు ఇంతగా రాజభోగాలు అందిస్తున్నారు అన్నది తెలుసుకోవాలన్న ఆసక్తి అందరికీ కలుగుతుంది. అందుకే ఈ కథనం మీ కోసం ..

 వీధి కుక్కలకు రాజభోగాలు అందిస్తున్న ఆశ్రమం

వీధి కుక్కలకు రాజభోగాలు అందిస్తున్న ఆశ్రమం

మూగజీవాలకు సేవ చెయ్యటం అంటే భగవంతునికి సేవ చెయ్యటం అని భావించే ఆశ్రమం అది. మహారాష్ట్రలోని నాగపూర్ శాంతినగర్ ప్రాంతంలో వందేళ్ళ క్రితం ఏర్పాటైన చిన్న ఆశ్రమం నేడు మూగజీవాలకు ఆహారం అందిస్తూ వాటికి ఆలవాలంగా మారింది. ఇక ఈ ఆశ్రమం పేరులో కూడా కుక్కలు ఉన్నాయి. ఈ ఆశ్రమాన్ని స్థానికులు కుత్తేవాలా బాబా కీ ఆశ్రమ్ అంటారు. దశాబ్దాలుగా వీధి కుక్కలకు తిండి పెడుతూ ఈ ఆశ్రమం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

రోజూ కుక్కల కోసం 50 కిలోల పిండితో రోటీలు

రోజూ కుక్కల కోసం 50 కిలోల పిండితో రోటీలు

ఇక ఆశ్రమంలో కుక్కలు తిరగని చోటు ఉండదు. అవి ఎక్కడ కూర్చున్నా, పడుకున్నా, ఏం చేసినా వాటిని అదిలించే ప్రసక్తే ఉండదు. సమయానికి ఆహారం, ఆపై వాటికి ఇష్టమైనట్టు జీవనం చూస్తే వీటి పనే బాగుంది అని చెప్పక తప్పదు. ఇక్కడ కుక్కలకు ప్రతీ రోజూ ఆహారం క్రింద 50 కిలోల పిండితో రొట్టెలు తయారు చేసి వాటిని పాలలో నానబెట్టి పెడతారు.

ఇక ఎవరైనా పెంపుడు జంతువులను పెంచలేమని భావిస్తే ఇక్కడ వదిలి వెళతారు. నిత్యం వందల సంఖ్యలో కుక్కలు ఇక్కడ కనిపిస్తాయి. కానీ ఒక్క కుక్క కూడా ఆశ్రమానికి వచ్చిన వారిని కరిచిన దాఖలాలు లేవు. వందేళ్ళ చరిత్రలో ఏనాడూ ఎవరినీ కుక్క కరిచిన సందర్భాలు లేవని ఆశ్రమ నిర్వాహకులు చెప్తున్నారు.

 వీధి కుక్కలకు ఆహారం పెడితే భగవంతుడిని పూజించినట్టే

వీధి కుక్కలకు ఆహారం పెడితే భగవంతుడిని పూజించినట్టే

వీధి కుక్కలకు ఆహరం పెట్టటం తమ గురువు అయిన పరమహంస రాం సంబర్ బాబా నుండి మొదలైందని ఆశ్రమ నిర్వాహకులు చెప్పారు. బాబా ఎప్పుడూ వీధి కుక్కలకు ఆహారం పెట్టేవారని, మనిషికి ఆకలేస్తే ఆహారం కావాలని అడుగుతాడు కానీ మూగ జీవాల పరిస్థితి ఏమిటని బాబా ప్రశ్నించేవారని, ఆయన నిత్యం కుక్కలకు ఆహారం పెట్టేవారని, అలా ఆహారం పెట్టటం భగవంతునికి సేవ చెయ్యటంతో సమానం అని చెప్పే వారని వారంటున్నారు.

ఇక బాబా 1967 సంవత్సరంలో జీవ సమాధి పొందారని అయినా తాము బాబా చెప్పినదాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు. ఆశ్చర్యం అనిపించినా మూగ జీవాల పట్ల వారు చూపిస్తున్న ఆదరణ, ప్రేమ మాత్రం ఆసక్తికరం.

English summary
There the street dogs are given a full meal and royal treats. Dogs Ashram is located in Nagpur, Maharashtra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X