Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'డాల్ఫిన్' సఫారీకి వెళ్దామా..? ఇండియాలో బెస్ట్ స్పాట్స్ ఇవే..

డాల్ఫిన్ లు సముద్రంలో.. నదీ జలాల్లో కనిపిస్తుంటాయి. అయితే నీటిలో డాల్ఫిన్ విన్యాసాలను చూసేందుకు చాలామంది పిల్లలు, పెద్దలు ఆసక్తి చూపిస్తుంటారు. అవి సముద్రం నుంచి అలా పైకి వచ్చి ఒంపులు తిరుగుతూ గాలి పీల్చుకుని మళ్లీ క్షణాల్లో నీటిలోకి జారుకుంటాయి. ఇలాంటి అద్భుతమైన దృశ్యాల్ని మనం కేవలం సినిమాల్లోనే చూస్తుంటాం.. అయితే రియల్ లైఫ్ లోనూ మనకు అలాంటి ప్లేస్ లు ఉన్నాయి. ఓవైపు సముద్ర ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తూనే మరోవైపు డాల్ఫిన్ ల విన్యాసాలను దగ్గర్నుంచి తనివితీరా వీక్షించవచ్చు.

Dolphin Safari in India Top Places to Spot These Playful Beauties

భారత్ లో సముద్ర తీరప్రాంతం దాదాపు 11 వేల కిలోమీటర్లు ఉంది. అలాగే దేశంలో ఎన్నో నదలు, సరస్సులు ఉన్నాయి. వీటిల్లో రకరకాల జాతులకు చెందిన డాల్ఫిన్ లు నివాసం ఉంటున్నాయి. ఇవి చాలా తెలివైనవిగా చెబుతుంటారు. సముద్ర తీరంలో అవి జంప్స్ చేస్తూ.. స్మిమ్మింగ్ చేస్తూ ఉంటాయి. వాటి ప్రవర్తన కూడా విచిత్రంగా ఉంటుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో డాల్ఫిన్ లను చూడాలంటే సూర్య లంక బీచ్ కు వెళ్లాల్సిందే. బాపట్లలోని సూర్యలంక సముద్ర తీరంలో మనకు డాల్ఫిన్ లు కనిపిస్తుంటాయి. ఈ ప్రదేశం హైదరాబాద్ కు 320 కిలోమీటర్లు ఉంటుంది. సూర్యలంక బీచ్ కు అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో వెళ్తే సూపర్ థ్రిల్లింగ్ గా ఉంటుంది. అలాగే ఏపీలోని తీర ప్రాంతాలైన మచిలీపట్నం, చీరాలలోనూ మనం డాల్ఫిన్ లను చూడొచ్చు. అలాగే వైజాగ్ లోని ఆర్కే బీచ్, రుషికొండ ప్రాంతాల్లోనూ తెల్లవారుజామున డాల్ఫిన్ లను మనకు కనిపిస్తుంటాయి.

ఇక భారత్ లో మరికొన్ని ప్రాంతాల్లో మనం డాల్ఫిన్ లను చూడొచ్చు.. వాటి వివరాలు చూస్తే.. ఒడిషాలోని చిలికా సరస్సు.. ఈ సరస్సు ఇర్రవాడీ డాల్ఫిన్ జాతికి చాలా ఫేమస్. ఈ సరస్సు ఒడ్డు నుంచి లోపలికి బోటింగ్ ఉంటుంది. బోట్ జర్నీలో డాల్ఫిన్ లు చూడొచ్చు. అలాగే గోవాలోని కాలన్ గుటే, కాండోలిమ్, కోకో, పాలోలెమ్ బీచ్ ల్లో డాల్ఫిన్ లు కనిపిస్తాయి. గోవా.. ఇండో- పసిఫిక్ హంప్ బ్యాక్ డాల్ఫిన్ కు ఫేమస్. ఇక్కడి బీచ్ ల్లో ఒక్కో టూరిస్ట్ రూ. 500 చెల్లించి బోట్ జర్నీ చేయవచ్చు.

మహారాష్ట్రలోని కొంకణ్ కోస్ట్.. కొంకణ్ టౌన్స్ అయిన దపోలీ, మురుద్, తర్కాలీ తీర ప్రాంతాల్లో తెల్లవారుజామున డాల్ఫిన్ లు కనిపిస్తాయి. దపోలీలో డాల్పిన్ సఫారీ ఉంది. రూ. 300 ఒక్కొక్కరికి చెల్లించాలి. అలాగే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లోని హావెలోక్ ఐలాండ్, నార్త్ బే ఐలాండ్ ప్రాంతాల్లో డాల్ఫిన్ లు కనిపిస్తుంటాయి. అలాగే బిహార్, ఉత్తర్ ప్రదేశ్ లోని గంగానదిలో.. ది గాంగెటిక్ డాల్ఫిన్ మనకు కనిపిస్తాయి. అలాగే లక్షద్వీప్ లోని అగట్టీ, బంగారం ఐలాండ్స్ లోనూ మనకు డాల్ఫిన్ లు కనువిందు చేస్తాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+