స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు: మోడీకి ట్రంప్ ఫోన్
భారత 71వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. సోమవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేశారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
న్యూఢిల్లీ: భారత 71వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. సోమవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేశారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ విషయాన్ని ప్రధాని మోడీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ అభినందించారు. కాగా, ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన మోడీ.. ట్రంప్‌తో పలు అంశాలపై చర్చించిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలను పెంచేందుకు ఇరువురు నేతలు పలు నిర్ణయాలు కూడా తీసుకున్నారు.
Appreciate the warm felicitations from @POTUS, who called this evening to convey Independence Day greetings. Thank you @realDonaldTrump.
— Narendra Modi (@narendramodi) August 14, 2017
అంతేగాక, ఈ నవంబర్‌లో హైదరాబాద్‌లో జరగబోయే అంతర్జాతీయ వాణిజ్య సదస్సుకు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హాజరవనున్నారు. ఇవాంకా ట్రంప్ రాక కోసం తాను ఎదురుచూస్తున్నానని మోడీ కొద్ది రోజుల క్రితం ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ట్రంప్, ఇవాంకా కూడా హైదరాబాద్ పర్యటనపై ట్విట్టర్ వేదికగా స్పందించారు.












Click it and Unblock the Notifications