అత్యంత కౄరంగా.. బాలుడి తల నరికి.. ఆపై అవయవాలు తినేశాడు..
ఆడుకుంటున్న మోనిస్ ను నజీమ్ సమీపంలోని బంధువు ఇంటికి బలవంతంగా లాక్కుపోయాడు.ఆపై అతని తల నరికివేసి రక్తపు మడుగులో ఉన్న అతని శరీరం నుంచి కొన్ని అవయవాలను తినడం మొదలుపెట్టాడు.
లక్నో: మత్తు పదార్థాలకు బానిసైన ఓ యువకుడు విచక్షణ కోల్పోయాడు. అసలేం చేస్తున్నాడో తెలియని స్థితిలో ఒక బాలుడిని హత్య చేయడమే గాక.. ఆపై అత్యంత జుగుప్స కలిగించేలా అతని శరీర భాగాలను భుజించాడు. సంఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు సైతం సదరు నిందితుడి తీరుకు నివ్వెరపోయారు.
ఉత్తరప్రదేశ్ లోని పిలిభిత్ జిల్లా అమారియాలో మంగళవారం నాడు ఈ ఘటన వెలుగుచూసింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మహమ్మద్ మోనిస్ అనే బాలుడు ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో డ్రగ్స్ మత్తులో ఉన్న నజీమ్ అనే యువకుడు అటువైపుగా వచ్చాడు.

ఆడుకుంటున్న మోనిస్ ను నజీమ్ సమీపంలోని బంధువు ఇంటికి బలవంతంగా లాక్కుపోయాడు.ఆపై అతని తల నరికివేసి రక్తపు మడుగులో ఉన్న అతని శరీరం నుంచి కొన్ని అవయవాలను తినడం మొదలుపెట్టాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకునేసరికి హత్యకు గురైన బాలుడి శరీరంలో కొన్ని అవయవాలు లేకుండా పోవడం పోలీసులు గుర్తించారు. ఆపై ఆరా తీయగా అసలు విషయాన్ని నిందితుడు అంగీకరించాడు. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా.. స్థానికులు అతనిపై దాడికి యత్నించారు.
మోనిస్ తండ్రి ఫిర్యాదు మేరకు నజీమ్ పై ఐపీసీ సెక్షన్-302(హత్య), 362(కిడ్నాప్), 341సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితున్ని జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications