Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Drug mafia: రాగిణి ఖైదీ నెంబర్ 8912, జైల్లో తొలిరాత్రి, మేడమ్ కరోనా వస్తుంది, అక్కడే శశికళ, సంజనా !

బెంగళూరు/ ముంబాయి: మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 786, ఖైదీ నెంబర్ 150 సినిమాలు ఎంత సూపర్ హిట్ అయ్యి పాపులర్ అయిన విషయం తెలిసిందే. డ్రగ్స్ మాఫియా కేసులో అరెస్టు అయ్యి జైలుకు వెళ్లిన స్యాండిల్ వుడ్ బ్యూటీ హనీ రాగిణి ద్వివేదికి ఇప్పుడు ఖైదీ నెంబర్ 8912 ఇచ్చారు. తనకు అనారోగ్యంగా ఉందని ఆసుపత్రిలో ఉంటాను అంటే కోర్టు నో అని చెప్పింది. జైల్లో తాను బయటి నుంచి భోజనం తెప్పించుకుని తింటాను అంటే కరోనాను అడ్డం పెట్టుకుని జైలు అధికారులు రాగిణి కోరికకు బ్రేక్ వేశారు. మొత్తం మీద సెంట్రల్ జైల్లో నటి రాగిణి తొలిరాత్రి చేదు అనుభవాలతో గడిపిందని తెలిసింది. మేడమ్ రాగిణి ఉంటున్న పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లోనే చిన్నమ్మ వీకే. శశికళ నటరాజన్ కూడా ఉంటున్నారు.

 డ్రగ్స్ మాఫియాతో మేడమ్ కు లింక్

డ్రగ్స్ మాఫియాతో మేడమ్ కు లింక్

డ్రగ్స్ మాఫియాతో లింక్ పెట్టుకున్న స్యాండిల్ వుడ్ బ్యూటీ క్వీన్ రాగిణి ద్వివేదిని బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేసిన విషయం తెలిసిందే. సోమవారంతో నటి రాగిణి ద్వివేది పోలీసు కస్టడీ గడువు పూర్తి కావడంతో ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బెంగళూరు 1వ ఏసీఎంఎం కోర్టు ముందు హాజరుపరిచారు.

 14 రోజులు జైలుకు పంపించండి

14 రోజులు జైలుకు పంపించండి

కేసు వివరాలు తెలుసుకున్న బెంగళూరు 1వ ఏసీఎంఎం న్యాయస్థానం నటి రాగిణితో పాటు డ్రగ్స్ కేసు దందాలో అరెస్టు అయిన ప్రశాంత్ రంకా, సిమాన్, రాహుల్, నియోజ్ లను 14 రోజుల పాటు రిమాండ్ కు తరలించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు రాగిణి ప్రశాంత్ రంకా, సిమాన్, రాహుల్, నియోజ్ లను బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు.

 రాగిణి ఖైదీ నెంబర్ 8912

రాగిణి ఖైదీ నెంబర్ 8912

బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు చేరుకున్న నటి రాగిణి ద్వివేదికి అక్కడి వైద్యులు సాధారణ ఖైదీలు ఉండే బ్యారెక్ కు పంపించారు. జైలు నిబంధనల ప్రకారం నటి రాగిణికి జైలు అధికారులు ఖైదీ నెంబర్ 8912 నెంబర్ కేటాయించారు. 8 తరువాత 9, 1 తరువాత 2 వరుసగా వస్తుంది. రాగిణికి కేటాయించిన ఖైదీ నెంబర్ 8912 నెంబర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాలం కలిసి వచ్చి అందరూ గుర్తుపెట్టుకునే విధంగా నటి రాగిణికి ఖైదీ నెంబర్ 8912 అనే ఫ్యాన్సీ నెంబర్ కేటాయించారని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

 మేడమ్ కరోనా ఉంది.... నోచాన్స్

మేడమ్ కరోనా ఉంది.... నోచాన్స్

నటి రాగిణికి అనారోగ్యంగా ఉందని, ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందడానికి అవకాశం ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాదులు కోర్టులో మనవి చేశారు. అయితే కోర్టు అందుకు అంగీకరించలేదు. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఆసుపత్రి ఉందని, నటి రాగిణి అక్కడ చికిత్స పొందవచ్చని కోర్టు సూచించింది. బయట నుంచి భోజనం తెప్పించుకోవడానికి నటి రాగిణి ప్రయత్నించింది. అయితే బయట కరోనా వైరస్ తాండవం చేస్తోంది, బయట నుంచి భోజనం తెప్పించుకోవడానికి తాము అనుమతి ఇవ్వమని జైలు అధికారులు స్యాండిల్ వుడ్ బ్యూటీ రాగిణి కోరికకు బ్రేక్ వేశారు.

 జైల్లో రాగిణి తొలిరాత్రి

జైల్లో రాగిణి తొలిరాత్రి

పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో తయారు చేసిన భోజనం నటి రాగిణికి అందించారు. ఇంతకాలం ఏంకావాంటే ఆవంటలు చేయించుకుని హ్యాపీగా ఆరగించిన నటి రాగిణి ద్వివేది మొదటిసారి జైల్లో చిప్పకూడు తినాల్సివచ్చింది. పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో రాత్రి నిద్రపట్టక నటి రాగిణి రాత్రి జాగారం చేసిందని తెలిసింది.

ఒకే జైల్లో రాగిణి, చిన్నమ్మ శశికళ

ఒకే జైల్లో రాగిణి, చిన్నమ్మ శశికళ

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి నెచ్చళి వీకే. శశికళ నటరాజన్ (చిన్నమ్మ) కూడా బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లోనే అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్నారు. డ్రగ్స్ మాఫియా కేసులో నటి రాగిణి కూడా ఇప్పుడు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు వెళ్లారు. కేసులు ఎవైనా ఇద్దరు ఫేమస్ మహిళలు అయిన వీకే. శశికళ నటరాజన్, నటి రాగిణి ఇప్పుడు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లోనే ఉంటున్నారు.

Recommended Video

    COVID-19 సహా వైరల్ ఇన్ఫెక్షన్లను చంపడానికి APT™ T3X Ointment తో కరోనా వైరస్ కు చెక్ ! || Oneindia
     పోలీసు కస్టడీలో సంజనా

    పోలీసు కస్టడీలో సంజనా

    డ్రగ్స్ కేసులో రాగిణితో పాటు అరెస్టు అయిన మరో నటి సంజనా ప్రస్తుతం బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల కస్టడీలో ఉంది. బెయిల్ కోసం నటి సంజనా కోర్టులో పిటిషన్ దాఖలు చెయ్యకపోవడంతో ఆమెను పోలీసులు కస్టడీకి తీసుకుని విచారణ చేస్తున్నారు. పోలీసు కస్టడీ గడుపు పూర్తి అయిన తరువాత నటి సంజనా బెయిల్ కోసం ప్రయత్నాలు చెయ్యకపోతే ఆమెను పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+