షాకిచ్చారు: డ్రంక్ అండ్ డ్రైవ్, రూ. 10 వేలు ఫైన్
న్యూఢిల్లీ: మద్యం సేవించి ఇక ముందు వాహనాలు నడిపితే పరిస్థితి వేరుగా ఉంటుంది. ఇంత కాలం తప్పించుకుని తిరుగుతున్న మందు బాబులు, పోలీసులకు చిల్లర్లు ఇచ్చి వెళ్లి పోతున్న వారికి కళ్లెం వెయ్యాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
కేంద్ర రవాణా శాఖ రూపొందించిన రోడ్డు రవాణ, భద్రతా బిల్లులో పలు మార్పులు చేశారు. అందులో కఠిన నిబంధలను పొందుపరిచారు. ఈ బిల్లును కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ద్వార పరిశీలన కోసం అన్ని రాష్ట్రాలకు పంపించారు.

ఈ బిల్లు చట్టరూపం దాల్చిన వెంటనే అన్ని రాష్ట్రాలలో శిక్షలు అమలులోకి రానుంది. ప్రస్తుతం మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి రూ. రెండు వేలు జరిమానా లేదా ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తున్నారు.
కొత్తగా వచ్చే చట్టంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ మొదటి సారి పట్టుబడిన వారికి రూ. 10 వేలు జరిమానా విధిస్తారు. మళ్లీ పట్టుబడితే భారీ జరిమానాతో పాటు ఆరు నెలల నుండి ఒక సంత్సరం జైలు శిక్ష విధించనున్నారు.












Click it and Unblock the Notifications