వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చలిలో తమ్ముడు.. రాత్రంతా అమ్మాయితో అన్న: తట్టుకోలేక హత్య!

గర్ల్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేసేందుకు.. అర్థరాత్రి పూట తనను బయటకు పంపిస్తున్నాడన్న కోపంతో అన్నను హత్య చేశాడు ఓ తమ్ముడు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గర్ల్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేసేందుకు.. తమ్ముడిని అర్థరాత్రి పూట గది నుంచి బయటకు పంపించాడు ఓ అన్న. అసలే చలికాలం.. రాత్రంతా చలిలో గడపడం అతనివల్ల కాలేదు. ఏదో ఒకటి రెండుసార్లు సర్దుకుపోయాడు గానీ.. ఆ తర్వాత కూడా ఇదే సీన్ రిపీట్ కావడంతో తమ్ముడిలో ఆవేశం కట్టలు తెంచుకుంది. తోడబుట్టినవాడు అన్న సంగతి మరిచిపోయి.. అన్నను దారుణంగా హత్య చేశాడు.

వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీ యూనివర్సిటీలో పీజీ చేస్తున్న హిమాంశు(23), సంస్కృత లెక్చరర్ గా పనిచేస్తున్న అతని అన్న హితేష్(25) ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇదే క్రమంలో హితేష్ తన గర్ల్ ఫ్రెండ్ ను రూమ్ కు తీసుకొచ్చేవాడు. అర్థరాత్రి పూట అమ్మాయిని గదికి తీసుకొచ్చి.. తమ్మున్ని బయటకు వెళ్లాలని చెప్పేవాడు. గత్యంతరం లేక రాత్రంతా బయట చలిలోనే గడిపేవాడు హిమాంశు.

 DU student kills brother with dumbbell after heated argument over girlfriend's stayover

ఈమధ్య ఇదో నిత్యకృత్యంగా మారడంతో తీవ్ర ఆవేశంతో రగిలిపోయాడు. అన్నతో గొడవపడి డంబెల్ తో అతని తలమీద గాయపరిచి హత్య చేశాడు. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి ఏదో కట్టుకథ చెప్పాడు. పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో.. భోరున ఏడుస్తూ అసలు నిజం చెప్పేశాడు. మొదట్లో గర్ల్ ఫ్రెండ్ వ్యవహారాన్ని సీక్రెట్ గానే మెయింటెయిన్ చేసిన హితేష్.. ఇక ఎలాగు తమ్ముడికి తెలిసిపోయిందని సహకరించాలని కోరాడు.

మొదట్లో సహకరించినా.. ఆ తర్వాత అతనివల్ల కాలేదు. చలిపూట రాత్రంతా బయట గడపడం అతను తట్టుకోలేకపోయాడు. దీంతో అన్నతో గొడవపడి ఆఖరికి హత్య చేశాడు. ప్రస్తుతం హిమాంశు మీద ఐపీసీ సెక్షన్ 302కింద కేసు నమోదు చేశారు పోలీసులు. కాగా, వీరి తల్లిదండ్రులు మహారాష్ట్రలోని ఝాన్సీ ప్రాంతంలో నివసిస్తారని పోలీసులు వెల్లడించారు.

English summary
A 28year old Sanskrit professor was brutally killed by his younger brother in north delhis burari area after heated argument.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X