కాంగ్రెస్ లీడర్ కొడుకు అపార్ట్ మెంట్ రూ 100 కోట్లు
ముంబై: ముంబై మహానగరంలో కాంగ్రెస్ నాయకుడి కుమారుడు ఏకంగా రూ. 100 కోట్లకు ఓ అపార్ట్ మెంట్ కొనుగోలు చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. బీహార్ మాజీ గవర్నర్ డీవై పాటిల్ కుమారుడు అజింక్య పాటిల్ ఈ అపార్ట్ మెంట్ ను కొన్నారు..
ముంబై నగరంలోని వర్లి సమీపంలోని సిల్వరిన్ టెర్రస్ ప్రాంతంలో ఓ ట్రిపుల్ డూప్లెక్స్ అపార్ట్ మెంట్ ను అజింక్య పాటిల్ కొన్నారు. సముద్రానికి ఎదురుగా ఉండే ఈ 23 అంతస్తుల భవనం గురించి ముంబై నగరంలో దాదాపు అందరికి తెలుసు.
అజింక్య పాటిల్ కు ఏఐపీఎస్ రియల్ ఎస్టేట్ అనే కంపెనీ ఉందని. ఆ కంపెనీ పేరుతోనే ఈ అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ కొన్నారు. ఈ ఆస్తిని రూ. 95.4 కోట్లకు కొన్నామని, స్టాంప్ డ్యూటీ కింద రూ. 4.7 కోట్లు చెల్లించామని కంపెనీ ప్రతినిధి దిలీప్ కవాడ్ చెప్పారు.

21, 22, 23 అంతస్తుల్లో ఉన్న ట్రిపుల్ డూప్లెక్స్ అపార్ట్ మెంట్ పాటిల్ సొంతం అయ్యింది. ఈ ఆస్తిని కొనుగోలు చేశామని, ఇది కంపెనీకి మంచి పెట్టుబడి అవుతుందని కంపెనీ ప్రతినిధి దిలీప్ కవాడ్ అన్నారు.
దీనికి అద్బుతమైన టెర్రస్ తో పాటు మూడో పోడియం లెవల్ లో పార్కింగ్ సదుపాయం ఉందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ రూ. 100 కోట్ల అపార్ట్ మెంట్ డీల్ మార్కెట్లో పెనుమార్పులకు దారి తీస్తుందని ముంబై రియల్ ఎస్టేట్ వర్గాలు అంటున్నాయి.












Click it and Unblock the Notifications