ఢిల్లీలో భూకంపం: హరియాణాలో భూకంప కేంద్రం
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో భూప్రకంపనలు సంభవించడంతో ప్రజలు హడలిపోయారు. విషయం తెలుసుకున్నసంబంధిత అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

సోమవారం మద్యాహ్నం 2.50 గంటల సమయంలో ఢిల్లీలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలు పై 3.7 తీవ్రత నమోదు అయ్యిందని సంబంధిత అధికారులు తెలిపారు. ఢిల్లీ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు కంపించాయి.
హరియాణాలోని మహేంద్రగఢ్ లో భూకంప కేంద్రం ఉందని గుర్తించామని అధికారులు చెప్పారు. ఢిల్లీ, హరియాణాలో భూ ప్రకంపల కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications