కంపించిన ఢిల్లీ, ఎన్సీఆర్: 5.8 తీవ్రతతో భూకంపం, జనం పరుగులు

ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. మంగళవారం మధ్యాహ్నం 2.28 గంటల సమయంలో ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్) ప్రాంతంలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైంది.

న్యూఢిల్లీ: ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. మంగళవారం మధ్యాహ్నం 2.28 గంటల సమయంలో ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్) ప్రాంతంలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైంది.

భూ ప్రకంపనలు రాగానే.. ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. మరోవైపు, రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. స్వల్ప తీవ్రతతోనే భూమి కంపించడంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు.

Earthquake In Delhi: 5.8 Magnitude Strong Tremors Jolts Delhi-NCR, Epicentre In Nepal

కాగా, నేపాల్ దేశంలో సంభవించిన భూకంపం ధాటికి ఢిల్లీలో ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పితోర్‌గఢ్‌కు తూర్పున 148 కిలోమీటర్ల దూరంలోని నేపాల్ దేశంలో ఈ భూకంప కేంద్రం ఉంది.

మంగళవారం మధ్యాహ్నం 2.28 గంటలకు ఇక్కడ భూకంపం సంభవంచిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+