ఢిల్లీ-ఎన్సీఆర్ సహా యూపీ, ఉత్తరాఖండ్, నేపాల్‌లో భూకంపం: 4.4గా తీవ్రత నమోదు
దేశ రాజధాని న్యూఢిల్లీతోపాటు రాజధాని పరిధిలోని ప్రాంతం, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో బుధవారం భూ ప్రకపంనలు చోటు చేసుకున్నాయి.
న్యూఢిల్లీ: దేశంలో పలు ప్రాంతాల్లో భూకంపాలు కలకలం సృష్టించాయి. దేశ రాజధాని న్యూఢిల్లీతోపాటు రాజధాని పరిధిలోని ప్రాంతం, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో బుధవారం భూ ప్రకపంనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై 4.4గా తీవ్రత నమోదైంది.
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రజలు భయంతో నివాసాలు, కార్యాలయాల నుంచి బయటికి పరుగులు తీశారు. అయితే, భూకంప తీవ్రత తక్కువగా ఉండటం పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఎక్కడా కూడా ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. ఉత్తరాఖండ్ లోని పితోర్‌గఢ్‌లో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిసింది.

మరోవైపు నేపాల్ దేశంలోనూ పలు చోట్ల భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కాగా, మనదేశంలో హిమాలయ ప్రాంతంలోనూ టర్కీ-సిరియా తరహా భూకంపాలు వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే నిపుణులు పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా, భూకంపాలు చోటు చేసుకోవడం ఆందోళనలు కలిగిస్తోంది.
Earthquake of Magnitude:4.4, Occurred on 22-02-2023, 13:30:23 IST, Lat:29.56 & Long:81.70, Depth: 10 Km ,Location: 143km E of Pithoragarh, Uttarakhand, India for more information Download the BhooKamp App https://t.co/MNTAXJS0EJ@Dr_Mishra1966 @Ravi_MoES @ndmaindia @Indiametdept pic.twitter.com/ovDBNhb7VO
— National Center for Seismology (@NCS_Earthquake) February 22, 2023
కాగా, ఇటీవల టర్కీ-సిరియాలో చోటు చేసుకున్న పెను భూకంపం కారణంగా సుమారు 50 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రాయులయ్యారు. వేలాది మంది క్షతగాత్రులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications